పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంపు. 7 బెజవాడ - జూలై 1928. సంచిక 1.

ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము.

పూర్వచరిత్ర: కావలసిన అభివృద్ధి.

ఆంధ్రోద్యమము యొక్క ----- నొప్పు ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ పూర్వచరిత్రను సింహావలోకనముగ పరిశీలించినచో అందు కావలసిన యభివృద్ధికి సూచనలు గోచరించుటయే గాక మాతృదేశమును ప్రస్తుతకాలమున కలవరపెట్టుచున్న అనేక సమస్యలకు సమాధానము వచ్చుననుట నిశ్చయము.

ఈ యుద్యమము యొక్క పరమప్రాప్యము ప్రజల జ్ఞానాభివృద్ధి. ఈఫలప్రాప్తికొర కవలంబించవలసిన సాధనవిధానమును గూర్చి భేదాభిప్రాయము లుండుటకు తావులేదు. కావున ఇప్పుడు మనదేశమున పెచ్చుపెరిగిన కులకక్షలు, మతద్వేషములు, రాజకీయ పక్షముల ననుసరించి యుండెడి వైషమ్యములకును స్థానమీయక గ్రంథాలయముల పక్షమున ప్రథమదశయందు జరిగిన కృషియంతయు సర్వజన సమ్మతమై సర్వజన సహకారమును పొంది "సర్వేజనాస్సుఖినోభవన్తు" యను యార్యోక్తికి యుదాహరణమని చెప్పుటకు తగిన విధముగ ప్రవర్తించినది. అందుకే అప్పటి పల్లెటూరు గ్రంథాలయముల యందేమి, బస్తీ గ్రంథాలయముల యందేమి, వేరువేరు అంతరములు గలవారందరు ఏకత్ర సమావేశమై అన్యోన్యాభివృద్ధికి తోడ్పడుచుండిరి. అప్పటికాలము వేరు, ఇప్పటి దినములువేరు. అప్పుడు గ్రంథాల యోద్యమ మంతయు ప్రజాయత్తమైయుండి అందు