Jump to content

పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్సాహము లేకపోవుటచే క్రమముగా క్షీణదశలోనికి వచ్చినది. ఇటీవల ఈగ్రామమందు గ్రామపంచాయితి స్థాపింపబడినది. దానికి శ్రీ కొత్తపల్లి నరసింహముగారే అధ్యక్షులుగ నున్నారు. ఈ గ్రంథాలయమును పంచాయితీవారి యాజమాన్యము క్రింద దీసికొని జయప్రదముగ నిర్వహించుచున్నారు.

రామమోహన గ్రంథాలయము.

ఘంటసాల, కృష్ణాజిల్లా.

ఈ గ్రంథ్హాలయము చాలకాలమునుండి పనిచేయుచున్నది. కాని ధనములేమిచే తృప్తికరముగా పనిచేయజాలకున్నది. కొంతకాలము క్రిందట యీ గ్రామసహకారపరపతిసంఘమువారి యాజమాన్యమున నిర్వహించుటకు తీసికొనబడినది. దీని లోకలు కోఆపరేటీవుయూనియనువారు యీ గ్రంథాలయమునకు రెండువందల రూపాయిలు విరాళ మిప్పించవలసినదిగా ప్రభుత్వవారికి సిఫార్సుచేసినారు.

స్వవిషయము.

భదవదను గ్రహమువలన "గ్రంథాలయసర్వస్వమును" తిరిగి ప్రారంభింప గలిగితిమి. మాసపత్రికగ వెలువడుచుండును. సంవత్సరమునకు చందా అందఱకును అందుబాటులో నుండునటుల రు 1 - 4- 0 లుగ ఏర్పరుపబడినది. గ్రంథాలయోద్య మాభిమానులందరును ప్రోత్సాహించెదరని ప్రార్థన.