తూర్పుగోదావరిజిల్లా ఆలమూరు వాస్తవ్యులును సహకారోద్యమ నాయకులును అగు శ్రీయుత నరసింహదేవర సత్యనారాయణగారి యాధిపత్యమున పుస్తక భాండాగారసభ సమావేశమయినది. ఆహ్వాన సంఘాధ్యక్షులగు రామనాథజిల్లాచీఫ్ ఆనరరీ ఆర్గనైజరు ఆనందరావుగారు పంచాయితీ పుస్తకభాండాగారాభివృద్ధిగూర్చియు, ప్రజాసామాన్యమునకు పుస్తక భాండారములు విజ్ఞానవ్యాప్తికి యెట్లు తోడ్పడగలవో విశదీకరించిరి.
అధ్యక్షకోపన్యాసము ఆంధ్రమున యుపన్యసింపబడినది. ప్రతి వాక్యమును అరవమునకు తర్జుమాచేయబడినది. ఆంధ్రదేశమునుంచి సుమారునాలుగువందల సంవత్సరముల క్రితము వచ్చి అరవదేశములో నివాస మేర్పరచుకున్న ఆంధ్రులే యీ పంచాయితీ పుస్తకభాండాగారాభివృద్ధివ్యాప్తికి తోడ్పడుచున్నారు. అధ్యక్షులు వందనము లర్పించుచు పుస్తక భాండాగారోద్యమము ఆంధ్రదేశములో గత 25 సంవత్సరములనుంచి ప్రభుత్వయాదరణతో సంబంధము లేకుండగ జాతీయోద్యమ వ్యాప్తికి, జాతీయ ప్రబోధమునకు గ్రామసీమలలో యెట్లు కృషిసలిపినది వ్యాప్తిగాంచినది తెలియజేసిరి. ప్రాచీనకాలమున విజ్ఞానవ్యాప్తికి ప్రభుత్వమువారు విశ్వవిద్యాలయములు దేవాలయస్థాపకులు పుస్తకభాండాగారములను రాజనగరులలో విశ్వవిద్యాలయములందును దేవాలయములందు పెంపొందించి ఎటుల భద్రపరచెడివారో - పౌరాణికులు ఎట్లు పోషింపబడుచుండెడివారో - పౌరాణిక గ్రంథములు శాస్త్ర గ్రంథములు వ్రాయుటకు గ్రంథములు భద్రపరచుటకు ఎట్టి ఏర్పాట్లు కావింపబడెడివో - తాటియాకులు ప్రశస్థమైనవి, వ్రాయుటకు తగినవి భద్రపరచుటకు ప్రత్యేకముగ సేవకులు ఎట్లు పోషింపబడెడివారో - మొదలగు చారిత్రక విషయములను ప్రాచీన శాసనములలో యెట్లు వివరింపబడినది నిరూపించిరి. చదువను వ్రాయను నేర్వని వారలకుకూడ ఆధునిక కాలములో మ్యాజిక్కిలాంతర్లు బయస్కోపులు మూలమున యెట్లుప్రదర్శనమూలమున విజ్ఞానమునువ్యాప్తిచేయుచున్నారో - ప్రాచీన కాలమున ప్రజాసామాన్యమునకు చరిత్రాంశములు బోధించుటకు