పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేటి గ్రంథాలయములు అట్టివారికిగూడ సహకారు లగుచున్నవి. చదువుకొన గలిగినవారు చదువుకొనజాలని వారికి గ్రంథములను చదివి వినిపించి; గ్రంథాలయములందు వారికి జ్ఞానమును ప్రసాదించు చున్నారు. ఇంతేగాక ఒక గ్రామమునందలి సమస్యలన్నియు గ్రంథాలయములందే పూరింపబడుచున్నవి. అందుచేత నేటి గ్రంథాలయములే గ్రామములయొక్క ఆయువుపట్టులు. వానిని మనము రక్షించి పోషించినగాని జాతియొక్క వికాసము సంపూర్తి గాజాలదు.

నైజాము రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ

సూర్యాపేటయందు మహావైభవముతో జరిగిన ఆంధ్రసభలలో గ్రంథాలయ మహాసభకు దేశభక్త వామననాయకుగారు అధ్యక్షత వహించిరి. వామన నాయకుగారు మిక్కిలి సమర్థతతోడను, ఉత్సాహముతోడను ఆంధ్రభాషయందే సభా కార్యక్రమమును జరిపిరి. గ్రంథాలయోద్యమమును నైజామురాష్ట్రములోని ఆంధ్ర జిల్లాలయందు వ్యాపింపజేయుటకుగాను ఒక ప్రచారకుని వేతనమునకై రు. 300 లు విరాళము నిచ్చెదమని అధ్యక్షులు వాగ్దానము జేసిరి. కేంద్రసంఘ యాజమాన్యమున నొక గ్రంథాలయ ఉపసంఘము ఏర్పరుప బడినది. ఈయుపసంఘమునకు శ్రీదేశభక్త నాయకగారు అధ్యక్షులుగ నుండ నంగీకరించిరి.

బరోడా గ్రంధాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంధాలయములకు విధ్యాశాఖ నుండియు లోకలుఫండునుండియు సహాద్రవ్యమిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయంలో పండ్రెండవభాగమును గ్రంధాలయోద్యమమునకై ప్రత్రేకించుటకును, ఈయుధ్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్కులరులను వెంటనే రద్దుచేయించ వలసినదనియు--హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంధాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంధము

బరోడా గ్రంథాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంథాలయములకు విద్యాశాఖ నుండియు లోకలుఫండు నుండియు సహాయద్రవ్య మిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయములో పండ్రెండవభాగమును గ్రంథాలయోద్యమమునకై ప్రత్యేకించుటకును, ఈ యుద్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్క్యులరులను వెంటనే రద్దు చేయించ వలసినదనియు - హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంథాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంథము