Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుధవరుల కొకవిజ్ఞప్తి

ఆర్యులారా! మాప్రియమిత్రులు, నాంధ్రభాషాభివృద్దికిఁ జిరకాలమునుండి పాటుపడుచుండువారిలో నగ్రగణ్యులు నగు బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరులుగారు గోపీనాథము వేంకటకవిశిరోమణివిరచిత మగునీయాంధ్రరామాయణమున కొకయుపోద్ఘాతము వ్రాయుమని కొంతకాలముక్రిందట నన్నుఁ బ్రోత్సాహము సేయఁగా నాఱుమాసములక్రిందట నారంభించి నేఁటికి ముగింపఁగలిగితిని. శ్రీరామాయణమువంటి మహానీయగ్రంథముయొక్క విశేషార్థములను సాకల్యముగా వివరించుట యెవ్వరికైన నశక్యము అందులో ముఖ్యముగా గోవిందరాజీయవ్యాఖ్యానము, తనిశ్లోకి మొదలగు గ్రంథములయందుఁ బ్రతిపాదింపఁబడిన యర్థములచే స్వీకరించితిని గాని స్వతంత్రముగా నెద్దియు వ్రాయలేదు తుదను వ్రాసినరామాయణ ఘట్టములయొక్క పరిష్కారములను బ్రహ్మశ్రీ వావిళ్ల రాముస్వామిశాస్త్రిగారు సంస్కృతవాల్మీకిరామాయణమునకు వ్రాసిన సంస్కృతోపాద్ఘాతమునుండి తెనిఁగించి సంగ్రహముగా వ్రాసితిని. గుణదోషవిమర్శకు లగుబుధజనులు నాయందు దయసేసి యందలిదోషములను విడనాడి గుణములను గ్రహింతురుగావుత మని యెల్లపుడును బ్రార్థించుచున్నాఁడను.

ఇట్లు, విన్నవించు బుధజనవిధేయుఁడు

విజయనగరము

శ్రీవిజయనగర మహారాజసంస్థాపితాంగ్లేయపాఠశాలా

26-మే, 1916

సంస్కృతభాషాధ్యాపకుఁడు