షష్ఠినాఁడు శృంగిబేరపురప్రవేశము. గుహునితో సమాగమము.
| | “ఆససాద మహాబాహు శ్శ్రుంగిబేరపురం ప్రతి" | |
(అయో. 50. స.)
సప్తమినాఁడు వనస్పతిమూలనివాసము.
| | "ఆదాయ మేథ్యం త్వరితం బుభుక్షితౌ | |
(అయో. 52. 102.)
అష్టమిరోజున భరద్వాజాశ్రమముఁ జేరుట.
| | "గత్వా ముహూర్త నుధ్వానం భరద్వాజ ముపాగమత్" | |
(అయో. 54. స.)
నవమినాఁడు యమునాతీరముఁ జేరుట.
| | "అథా౽సాద్యతు కాళిందీం శీఘ్రస్రోత సమాపగామ్ | |
(అయో. 54. 13.)
దశమినాఁడు సాయంకాలమందు సుమంత్రుఁ డయోధ్యను బ్రవేశించెను.
| | "అనుజ్ఞాత స్సుమంత్రో౽ధ యోజయిత్వా హయోత్తమాన్, | |
(అయో. 57. 4.)
ఆరాత్రియందే దశరథుఁడు స్వర్గతుఁ డగు . ఏకాదశినాఁడు దశరథునిమృతకళేబరము తైలద్రోణిలో నుంచఁబడినది.
| | "స రాజాం రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితే వనమ్, | |
(అయో. 63. 4.)
| | "తైలద్రోణ్యా మథామాత్యా స్సంవేశ్య జగతీపతిమ్, | |
(అయో. 66. 14.)
ద్వాదశినాఁడు భరతునివద్దకు దూతల నంపుట.
| | “వసిష్ఠే నాభ్యనుజ్ఞాతా దూతా స్సంత్వరితా యయుః” | |
(అయో. 65. 11.)
ఆదూతలు త్రయోదశి చతుర్దశి మార్గమందుఁ గడపి పౌర్ణమినాఁటి రాత్రి కేకయనగరమును బ్రవేశించిరి. పాడ్యమినాఁడు భరతుఁడు మాతులగృహమునుండి యయోధ్యకు బయలుదేఱెను. మార్గమధ్యమం దేడురాత్రులు గడపి యెనిమిదవరోజు నవమినాఁ డుదయమున కతిత్వరతో భరతుఁ డయోధ్యను బ్రవేశించెను.
| | "తాం పురీం పురుషవ్యాఘ్ర స్సప్తరాతోషితః పథి, | |
(అయో. 71, 18.)
ఆదినమందే దశరథునికి దహనాదిసంస్కారములు జరిగెను. ఆదినము మొదలుకొని పదుమూఁడురోజులవఱకు ననఁగా వైశాఖశుక్లపంచమివఱకు భరతుఁడు దశరథునికి శ్రాద్ధకర్మల నాచరించెను.