“వానరేంద్రా! భ్రాతృభార్యావమర్శనంబు సుగ్రీవునికిని సమానం బని యంటివేని సుగ్రీవుండు మాయావిబిలాంతర్గతయుద్ధంబున నీమరణంబు నిశ్చయించి తారయందు వర్తించె. నీవు సుగ్రీవుండు సప్రాణుం డగుట యెఱింగియు నతనిపత్నియగు రుమయందు వర్తించితివి. కావున నీదోషంబునకును సుగ్రీవునిదోషంబునకును వైషమ్యంబు గలదు. అట్లగుటం జేసి నిన్ను వధించితి.”
తృతీయాక్షేపము:—
బాలకాండములో వానరోత్పత్తిప్రకరణమందు గంధమాదనసుషేణశరభులయుత్పత్తి యొకరీతిగాను యుద్ధకాండములో రావణశార్దూలసంవాదమందు మఱియొకరీతిగాను బ్రతిపాదింపఁబడియున్నది. ఎట్లన:—
| | “ధనదస్య సుతశ్శ్రీమాన్ వానరో గంధమాదనః” | |
అని ప్రారంభించి
| | "వరుణో జనయామాస సుషేణం నామ వానరమ్, | (యుద్ధ.) |
ఈశ్లోకములయందు గంధమాదనుఁడు కుబేరపుత్రుఁ డనియు, సుషేణుఁడు వరుణసుతుఁ డనియు, శరభుఁడు పర్జన్యునికుమారుఁ డనియుఁ జెప్పఁబడినది.
| తే. | అవనిఁ గిన్నరేశునంశంబున జనించె, జగము లొక్కభంగి సన్నుతింపు | |
| తే. | ఘనబలుఁడు సింధుపతియంశమున జనించె, నలసుషేణుఁడు వనచరకులవరుండు | |
యుద్ధకాండములోఁ జెప్పఁబడినరీతి పైదానికి విరుద్ధముగా నున్నది, ఎట్లన:
| | “సుషేణ శ్చాత్ర ధర్మాత్మా పుత్త్రో ధర్మస్య వీర్యవాన్” | |
అని మొదలిడి
| | "పుత్రా వైవస్వత స్యాధ పంచ కాలాంతకోపమాః, | |
(యుద్ధ. 30. 26)
| | “ధర్మాత్ముఁ డగుసుషేణుండు ధర్మపుత్త్రుండు గజగవయగవాక్షగంధమాదనశరభులు వైవస్వతునిపుత్త్రులు." | |
అని యిట్లు సుషేణుఁడు ధర్మపుత్రుఁ డనియు, శరభగంధమాదనులు వైవస్వతపుత్త్రు లనియుఁ జెప్పుటచేత బాలకాండ యుద్ధకాండోక్తార్థములకుఁ బరస్పరవిరోధము చూపట్టుచున్నది. దీనికి సమాధాన మెట్లన:— సుషేణశరభగంధమాదను లనుపేరు గలవానరులు పెక్కుమంది యుండుటచే బాలకాండోక్తసుషేణశరభాదులకంటె యుద్ధకాండోక్తసుషేణశరభాదులు వేఱుగావునఁ బూర్వోక్త మయినవిరోధము లేదని తిలకవ్యాఖ్యానము ప్రతిపాదించుచున్నది.
చతుర్థాక్షేపము:—
పదునాలుగేం డ్లాహారనిద్రల వర్జించినవానిచేఁ గాని యింద్రజిత్తు వధింపఁ