Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కైకేయ్యా గ్రహణే పూర్వం త దుద్వాహే హ్యుపస్థితే.”

(ఉమాసంహిత)

దశరథుఁడు రాజ్య మిచ్చెదనని కేకయరాజునకుఁ బ్రతిజ్ఞ చేసి యట్లివ్వకపోవుటచే ననృతవాది కాలేదా యని పార్వతి శివు నడుగఁగా:—

"వివాహసమయే రాజ్ఞా ప్రతిజ్ఞాత మిదం శ్రుణు,
పట్టాభిషేకసమయే భవేయం స్మారితో యది.
త్వయా వా౽న్యేన భూపాల! తథా చ కరవా ణ్యహమ్,
ఇత్థం ప్రతిజ్ఞా మకరో ద్వివాహగ్రహణేనృపః.
తస్మా దస్మి న్నరవ్యాఘ్రే న దోషాస్తి శుభాననే.”

(ఉమాసంహిత)

దశరథుఁడు వివాహసమయమందుఁ గేకయరాజున కిట్లు ప్రతిజ్ఞ చేసెను. “ఓయి రాజా! పట్టాభిషేకసమయమందు నీసంగతి నీవు నాకు జ్ఞాపకము చేసినయెడల నట్లే చేయుదు” ననెను. కావున దశరథునియందు దోషములేదు. ఇదిగాక మఱియొకవిశేషము కలదు.

“దైవాసురే చ సంగ్రామే జనన్యై తన పార్థివః,
సంప్రహృష్టో దదౌ రాజా వర మారాధితః ప్రభుః.”

(అయో. 107. 4.)

కైకేయి తనవివాహకాలమందే కన్యాశుల్కముగాఁ దనపుత్త్రునికి రాజ్యప్రాప్తి సిద్ధమైయుండఁగాఁ దిరుగ దేవాసురయుద్ధములోఁ దా నొనర్చిన యుపచారములచే బరితుష్టుఁడైనరాజువలన భరతునికి రాజ్య మిప్పించెడు వరము నెట్లు కోరెనని మఱియొకప్రశ్న. వివాహకాలమందు దశరథుఁడు కైకేయికిఁ జేసిన ప్రతిజ్ఞ బాల్యమందు జరిగినదగుటచేతను జిరకాలాంతరిత మగుటవలనను కైకేయి యీసంగతి మఱచియుండవచ్చును తరువాత మఱికొంతకాలమునకు జరిగిన వరద్వయదానము సన్నిహిత మైనదగుటవలనఁ జిరకాలాంతరిత మైనదానిని మఱచి స్మృతిపథమునందు నూతనముగా నున్నవరద్వయమునే యాచించే నన్నచో దోషము లేదు. మధ్యకాలమందు జరిగిన యీవరద్వయమును గూడ కైకేయి మఱవఁగా:— "కిం న స్మరసి కైకేయి! స్మరంతీ వా నిగూహసే" (అయో. 9. 6.) అని మంథర జ్ఞాపకము చేసినమీఁదఁ గైకేయి స్మృతిపథమునకుఁ దెచ్చుకొన్నదన్నచో బాల్యమందు జరిగినవృత్తాంతము బొత్తిగా మఱిచెననుట యువపన్నతరమే వివాహకాలమందుఁ గైకేయీపుత్త్రునికి రాజ్య మిచ్చెద నని ప్రతిశ్రుతి చేసి దశరథుఁడు రాముని కెట్టు పట్టముఁ గట్ట నుద్యోగించెను? అన్నచో,

"ఉద్వాహకాలే రతిసంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారే,
విప్రస్యచార్థే౽ప్యనృతం వదేయుః పంచావృతా న్యాహు రసాతకాని."

అనున్యాయము నవలంబించి దశరథుఁ డట్లు చేసె నన్నయెడల దోషము లేదు.

ద్వితీయాక్షేపము:—

కిష్కింధాకాండములో వాలి నిరపరాధి నైనన న్నేల వధించితి వని యడుగఁగా శ్రీరామచంద్రుఁడు —