అత్రిమహామునిభార్య యగుననసూయతో సీత చెప్పిన పైశ్లోకమువలన వివాహకాలముకంటెఁ బూర్వమందే సీతకుఁ బతిసంయోగయోగ్య మగువయస్సు ప్రాప్తించినటులు స్పష్ట మగుచున్నది.
పద్మపురాణములో సీతోత్పత్తిక్రమ మిట్లు సెప్పఁబడినది.
| |
“అథ లోకేశ్వరీ లక్ష్మీ ర్జనకస్య నివేశనే,
శుభక్షేత్రే హలోత్ఖాతే సముద్భూతా సుమధ్యమా
బాలార్కకోటిసంకాశా పద్మపత్రనిభేక్షణా,
లంకాయాం వై సరశ్శ్రేష్ఠే పద్మకోశే పురా హ్యభూత్.
సర్వలక్షణసంపన్నా నిత్యయౌవనశాలినీ,
ధృత్వా వక్షసి చార్వంగీ మాలా మమ్లానపంకజామ్.
సీతాముఖే సముత్పన్నా సీతేతి భువి విశ్రుతా,
తాం దృష్ట్వా జనకో రాజా కన్యాం వేదమయీం శుభామ్,
ఉద్ధృ త్యాపత్యభావేన పుపోష మిథిలాధిపః,
జనకస్య కులే రమ్యే సర్వలోకేశ్వరప్రియా.
వవృధే సర్వలోకస్య రక్షణార్థం సురేశ్వరీ.”
|
|
వాల్మీకిచారిత్రములోఁ జెప్పఁబడినసీతోత్పత్తిక్రమ మిది:—
| |
"పురా లక్ష్మీ స్వభూ జ్జాతా పద్మకోశే సరోవరే,
లంకాయాం శివపూజార్థం రావణేనవ మహాత్మనా
పద్మా న్యాహర్తుకామేన దృష్టా సా శుభలక్షణా,
తాం దేవీం పద్మమధ్యస్థాం యాపనస్థా మయోనిజామ్.
దృష్ట్వా తు కేయ మితి వై రావణో విస్మయాకులః,
ప్రహస్తాదిభి రాలోచ్య మంత్రిభి ర్మంత్రకోవిదైః.
నిక్షిప్యతాం పేటికాయాం సింధుమధ్యే వ్యచిక్షిపత్,
కృతార్థ మివ చాత్మానం మేనే౽సౌ రాక్షసేశ్వరః.
సముద్రమధ్యే విక్షిప్తా నామ్నా వేదవతీ స్మృతా,
పేటికాంతస్స్థితా తన్వీ మిథిలానగరం గతా.
నదీజలప్రవాహా చ్చ చిరకాలం స్థితా హ్యభూత్,
మిథిలాయా శ్చోపకంఠే భూమే రంతర్గతా సతీ.”
|
|
పైన వ్రాసినశ్లోకములవలన సీత జననకాలమునుండియు “నిత్యయౌవనశాలినీ” “అయోనిజా” “యౌవనస్థా” అనువిశేషణములఁబట్టి యౌవనవిశిష్టురా లని తెలియఁబడుచున్నది. పైన వ్రాసిన మారీచదశరథోక్తులఁబట్టి యాలోచింపఁగా నప్రాప్తయౌవనుఁ డైనరామునికిఁ బ్రాప్తయౌవన యగుసీతకు వివాహము జరిగినట్టు గానవచ్చుచున్నది. ఇట్టివివాహ మెట్లు జరిగె నని శంక పొడమును. దీనికి సమాధానము:—