| | "పద్మములవంటి నేత్రములుగల నారాముఁడు పదునాఱేండ్లకుఁ దక్కువవయస్సుగలవాఁడు. కావున రాక్షసులతోఁ బోరుటకుఁ దగిన సామర్థ్య మితని కున్న దని నేఁ దలంపను.” | |
ఇది విశ్వామిత్రునితో దశరథుఁ డన్నమాట, పదునాఱేండ్లకుఁ దక్కువవయస్సు గలవాఁ డనుటచేఁ బూర్ణముగా షోడశవర్షము లున్నచోఁ గొంచెము యౌవనప్రాదుర్భావ మగుటవలన రాక్షసులతో యుద్ధము చేయుటకు శక్తిగలవాఁ డై యుండవచ్చును. ఆపాటివయస్సైనను రాలే దనుదశరథోక్తిచే రాముఁడు శైశవావస్థలో నున్నట్లు సూచింపఁబడినది.
మారీచుఁడు రావణునితోఁ జెప్పుమాట
జనస్థానవాసు లగుఖరాదులను వధించి నాసోదరి యగుశూర్పణఖను వైరూప్య మొందించుటచే నా కపకర్తయగు రామునిపైఁ బగఁ దీర్చికొనుట కాతనిభార్య యగుసీత నపహరించుటకుఁ దలంచియున్ననా కిపుడు నీవు కొంచెము తోడ్పాటు గావింపవలయునని రావణుఁడు మారీచునిఁ బ్రార్థింపఁగా వాఁ డిట్లనియె.
| | "కదాచి ద ప్యహం వీర్యా త్పర్యట న్పృథివీ మిమామ్, | |
(అర. 38. 2.7.)
ఈశ్లోకములయందుఁ జెప్పఁబడినట్లు పండ్రెండేండ్లవాఁ డనుదానికి దశరథుఁడు విశ్వామిత్రునితోఁ జెప్పినపుడు ఊనషోడశవర్షుఁ డనుదానికి నైక్యము ఘటింపఁజేయుటకు "ఊనషోడశ” శబ్దమునకుఁ బాదోనషోడశవర్ష మని నాల్గుచేఁ దక్కువైన పదునాఱు, (అనఁగా పండ్రెండు.) అని యర్థముఁ గల్పించినచోఁ బండ్రెండు సంవత్సరము లని లభింపఁగా రాముఁడు విశ్వామిత్ర యాగరక్షణసమయమునకుఁ బండ్రెండేండ్లవాఁ డనియు, యాగరక్షణానంతరము సుమారు రెండుమాసములలో సీతావివాహము జరుగుటచే సీత రామునికంటెఁ బెద్ద దని తోఁచుచున్నది.
| | "పతిసంయోగసులభం వయో దృష్ట్వా చ మే పితా, | |
(అయో. 118.34.)