| | "ఎవనిభార్య దూరదేశమం దున్నదియు యవిధేయురాలును నయి యుండునో ఆపురుషుఁడు దర్భతో భార్యాప్రతికృతిని జేసి దగ్గఱ నుంచుకొని శ్రౌతకర్మ నాచరింపవలెను. పత్ని చేయవలసిన కర్మలను యజమానుఁడు గాని అధ్వర్యుఁడు గాని చేయును. భార్య కర్మాచరణమం దసమర్థురా లయి యున్నను నశింపలేదు శావున నగ్నికిఁ గూడ నాశము లేదు.” | |
ఈవచనప్రమాణము ననుసరించి చూడఁగా రాముఁడు దూరదేశగతురా లయి జీవించియున్న సీత ప్రతికృతిని దనయొద్ద నిడికొని కర్మల నాచరించుట శాస్త్రవిహితముగాఁ గానవచ్చుచున్నది. ఇదియే కాక
| | “ఇష్ట యజ్ఞో రఘుపతిః పుత్రద్వయసమన్వితః, | |
(ఉత్త. 99.8.)
| | "సీత భూమిలోఁ బ్రవేశించినతరువాత శ్రీరామచంద్రుఁడు సీతావియోగదుఃఖము ననుభవించుచుఁ బుత్త్రద్వయముతోఁ గూడుకొన్నవాఁ డై సీతకంటె నితరభార్యను వరింపలేదు.” | |
రాముఁడు సీతయం దుండెడుస్నేహబహుమానములచే నామెప్రతికృతిని దగ్గఱ నుంచుకొనెను గాని యజ్ఞము నితరభార్యాసహకారముతోఁ జేసె ననుట మిక్కిలి యసమంజసము పరిత్యజించినభార్యయం దేపురుషుఁడు స్నేహబహుమానములఁ గనుపఱుచును? అట్లు చేసినచో నెంత యవద్యముగా నుండును?
రాముఁడు లక్ష్మణునితోఁ జెప్పుమాట.
| | "కాంచనీం మమపత్నీం చ దీక్షార్హం యజ్ఞకర్మణి, | |
(ఉత్త. 91.24.)
అనుప్రమాణమువలన యజ్ఞాచరణమందును సీతాప్రతికృతియే కాని రాముని కితరభార్యలు లేనట్టు స్పష్టమగుచున్నది. కాళిదాసుకూడ రఘువంశములో, “అనన్యజనే స్సైవాసీ ద్భార్యా యస్య హిరణ్మయీ" అని చెప్పియున్నాఁడు కావున రాముఁ డేకపత్ని గలవాఁడు గాని బహుపత్నీకుఁడు కాఁడు. “ స్త్రీభి స్తు మన్యే విపులేక్షణాభిః"అని సీత చెప్పినమాట తాను మృతినొందఁగాఁ దనభర్త తిరుగఁ బెండ్లి యాడు నని యూహించి సీత యీర్ష్యవలనఁ బలికిన పలుకుగాఁ దలంపవలయును. గాని సత్యముగాదు. “పరమనారీణా” మిత్యాదిశ్లోకములయందుఁ జెప్పఁబడినస్త్రీలు దాసీజను లని గ్రహింపవలయును.
4. సీతారాముల వయోనిర్ణయము
వివాహసమయమునకు సీతారాముల వయ స్సింతయని వాల్మీకిరామాయణమం దెచ్చటను నిశ్చయముగాఁ జెప్పలేదు. అనుక్తాంశ మన్యగ్రంథములనుండి గ్రహింపవలయు ననున్యాయము ననుసరించి రామాయణార్ధోపబృంహణము లైనపద్మపురాణము మొదలగువానిని విమర్శించి చూడఁగా రామునికంటె సీతయే వయోధికురా లయిన ట్లగపడుచున్నది. ఎట్లన:
| | "ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః, | (బాల) |