ఈశ్లోకార్థము నాలోచింపఁగా శ్రీరామోత్పత్తికిఁ బరమగు పుష్యమీనక్షత్రయుక్తదినందు భరతుఁడు పుట్టె నని స్పష్టమగుచున్నది. ఇతఁడు పుట్టినదినమునకు మఱుచటిదినమునం దుదయకాలమున లక్ష్మణశత్రుఘ్నులు జన్మించి రని యుత్తరార్థమువలనఁ దెలియఁబడుచున్నది. ఇందువలన లక్ష్మణునికంటె భరతుఁడే జ్యేష్ఠుఁ డని యెఱుఁగవలయును. జ్యేష్ఠుఁ డెప్పుడును కనిష్ఠునికి నమస్కరించుట యుచితము కాదుగదా! ఇ ట్లుండఁగా —
| | "ఇతి లోకసమాకృష్టః పాదేష్వద్య ప్రసాదయన్, | |
(అయో. 99. 17)
| | "అంకే భరత మారోప్య ముదితః పరిషస్వజే, | |
(యుద్ధ. 130. 40.)
ఈశ్లోకములయందు “లక్ష్మణ మాసాద్య” “అభివాద్య” “నామచా బ్రవీత్" అని కంఠోక్తముగాఁ జెప్పఁబడియున్నది.
| | “ఏవం దత్వా తత స్సీతాం మంత్రోదకపురస్కృతామ్, | |
(బాల. 73. స.)
అను నీశ్లోకముల ననుసరించి వివాహసమయమందు మొదట రామునికి సీత యీయఁబడియె. తరువాత లక్ష్మణుని కూర్మిళయు, భరతునికి మాండవియుఁ గడపట శత్రుఘ్నునికి శ్రుతకీర్తియు నీయఁబడిరి. ఈరీతిగాఁ గన్యాప్రదానక్రమమందుఁ గూడ రామునితరువాత జనకునిచే లక్ష్మణుఁ డుద్దేశింపఁబడియెఁ గాని భరతుఁ డుద్దేశింపఁబడలేదు. ఇందువలన భరతునికంటె లక్ష్మణుఁడే జ్యేష్ఠుఁ డనునంశము వెల్లడియగుచున్నది. ఇతరరామాయణములయందుఁ గూడ నీవాల్మీకిరామాయణప్రతిపాదితకన్యాదానక్రమమే యనుసరింపఁబడినది కనిష్ఠునికి జ్యేష్ఠుఁడు వందన మాచరించుట గాని, జ్యేష్ఠునికంటె ముందు కనిష్ఠునికిఁ గన్యాప్రదానము చేయుటగాని యుక్తము కాదు. కావునఁ బైని వ్రాసిన యుక్తిద్వయమువలనను —
| | "సీతా మాదాయ గచ్ఛ త్వ మగ్రతో భరతాగ్రజ! | |
(అయో. 55.)
ఇత్యాదిప్రమాణములవలనను భరతునికంటె లక్ష్మణుఁడే జ్యేష్ఠుఁ డని పూర్వ