అనుశ్లోకమును బట్టిచూడఁగా భరతుఁ డష్టమాంశభాగి గావలసియుండ విష్ణువుయొక్క చతుర్భాగ మని చెప్పుట విరోధముగా నున్నది. పైశ్లోకమువలన భరతుఁడు చతుర్థాంశ భాక్కని చెప్పినచో నట్లు కాదు. ఎట్లన: “సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః"అనుటచే రాముఁడు విష్ణువుయొక్క యర్ధాంశ మని లోగడఁ జెప్పియుండుటచే భరతుఁడు రామునియొక్క చతుర్థాంశ మనఁగా: సాక్షా ద్విష్ణువుయొక్క యష్టమాంశ మని తేలుటచే విరోధము లేదు.
| | "అథ లక్ష్మణశత్రుఘ్నో సుమిత్రా౽జనయ త్సుతౌ, | (బాల.) |
ఈశ్లోకమందు “విష్ణోరర్ధ సమన్వితౌ" విష్ణువుయొక్క యర్ధాంశముతోఁ గూడినవా రని చెప్పుటచే లక్ష్మణశత్రుఘ్నులకుఁ జతుర్థాంశభాక్త్వము ప్రతీయమాన మగుచున్నది. ఇది విరోధింపదు. ఏలయన:— ఇచట నర్ధశబ్దమున కేకదేశ మని యర్థముకాని సమానాంశ మర్థము కాదు. గావున విరోధము లేదు. దానిచే “విష్ణో రర్ధసమన్వితౌ” అనుదానికిఁ దేలిన యర్థ మేమనఁగా: విష్ణువుయొక్క యంశముతోఁ గూడినవా రని యర్థము.
రామలక్ష్మణభరతశత్రుఘ్నులు పరమాన్నభక్షణక్రమమున జనియించిరి. మొదట దశరథుఁ డిచ్చిన పాయసార్ధమును గౌసల్య యాక్షణమునందు భక్షించెను. అనంతర మవశిష్టార్థములో నర్ధమును సుమిత్ర కిచ్చెను. కాని యామె దానిని వెంటనే భుజింపక మిగిలినదాని నితఁ డేమి చేయునో చూత మని విచారించుచుఁ జేతిలోఁ బరమాన్న ముంచుకొని నిలువఁబడియుండెను. అంతలో దశరథుఁడు మిగిలిన పరమాన్నమును రెండుసమానభాగములఁ జేసి యొకభాగమును గైకేయి కొసఁగెను. ఆమె దానిని వెంటనే భుజించెను. పిమ్మట రాజు మిగిలినయష్టమాంశమును గైకేయి కిచ్చుటకు మనస్సుగలవాఁడై నను రహస్యక్రీడలయందుఁ బ్రేయసియెడలఁ బక్షపాత ముండవలయును గాని ఇట్టి ధర్మ్యవిభాగకర్మమందుఁ బక్షపాతముఁ జూపఁగూడ దనుధర్మము నెఱింగినవాఁడు గావున మిగిలినభాగమును గూడ సుమిత్ర కిచ్చెను. కాఁబట్టి మొదట శ్రీరామజననము, తరువాత భరతోత్పత్తి, పరదినమందు లక్ష్మణశత్రుఘ్ను లుదయించి రనుటకు విరోధము లేదు
2. లక్ష్మణభరతులలో నెవ్వరు పెద్ద?
రామశత్రుఘ్ను లుభయులలో రాముఁడు సర్వజ్యేష్ఠుఁ డనియు, శత్రుఘ్నుఁడు సర్వకనిష్ఠుఁ డనియు స్పష్టముగా నెల్లరకుఁ దెలిసియుండుటచే జ్యైష్యకానిష్ఠ్యవిషయకవివాదమునకుఁ బ్రసక్తియే లేదు. కొన్నిచోట్ల భరతుఁడు పెద్దవాఁ డనియు, మఱికొన్నిస్థలములయందు లక్ష్మణుఁడు పెద్దవాఁ డనియుఁ జెప్పఁబడియుండుటచే నాయంశ మిపుడు చర్చింపఁదగియున్నది.
| | "పుష్యే జాత స్సుభరతో మీనలగ్నే ప్రసన్నధీః, | |
(బాల. 18. 14.)