lxx
పీఠిక
వాచ్చాంబిళ్ల” యనునొకప్రాచీనవిశిష్టాద్వైతాచార్యుఁడు రామాయణమందలి యైదువందలశ్లోకముల నెంచి ద్రావిడభాషచే నొకరసవంతమయినవ్యాఖ్యానమును వ్రాసియున్నాఁడు. దానికి “తనిశ్లోకి” (అద్వితీయశ్లోకములు) యని పేరు.
ఈవేంకటకవి యీవాల్మీకిరామాయణమును దెనిఁగించుటలో మూఁడురీతుల నవలంబించియున్నాఁడు. ఎట్లన:—
1. పూర్వప్రబంధసరణి ననుసరించి కొన్నిచోట్ల యమకానుప్రాసాదిశబ్దాలంకారములతోను, రూపోత్ప్రేక్షాతిశయోక్త్యాద్యర్థాలంకారములతోను స్వతంత్రముగా వర్ణించి యర్థమును బెంచి పద్యముల వ్రాసియున్నాఁడు. (ఉదా:— గోపీ. బాల. 359,851; ఆయో. 400,90; అర. 68, 138; కిష్కిం 90; సుంద. 864, 256; యుద్ధ 99.)
ఈకవి యుద్ధకాండముకొసను సంధ్యాసమయవర్ణనము, చంద్రోదయ సూర్యోదయ వర్ణనములు మొదలగు వానిని స్వతంత్రముగా నతిరమణీయ మగుకల్పనలతో వ్రాసెను.
2. మఱికొన్నిస్థలములయందు మూలశ్లొకమునకు సరి యైన తెనుఁగర్థము వ్రాసియున్నాఁడు. ఉదా —
| మూ. | “న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః | |
(బాల. 18 స.)
| ఆంధ్రీకరణము. "క. | సొంపార రామభద్రుఁడు | |
| గీ. | ..... ... ననిమిషులచేతఁ బంకజాసనుఁడు వోలె." | |
(బాల. 433-436.)
| మూ. | "రత్నం హి భగవ న్నేత ద్రత్నహారీ చ పార్థివః | |
(బాల. 53. 9-14.)
| ఆంధ్రీ. "క. | మునివర గోరత్నం బిది, ... ... | |
| సీ. | ... ... ... నీదివ్యశబళ నీదగదు నీకు" | |
(బాల 1005, 1006.)
| మూ. | "నానృగ్వేదవినీతస్య నాయజుర్వేదధారిణః | |
(కిష్కి0.3.28-34.)
| ఆంధ్రీ. "తే. | జనవరకుమార! ఋగ్యజుస్సామువేద ... ... | |
| వ. | ... ... ... నట్టివానికార్యగతు లెవ్విధంబున సిద్ధించు.” | |
(కిష్కిం. 150.154.)
| మూ. | "ధర్మజ్ఞో గురుభి ర్దాంతః కృతజ్ఞ స్సత్యవా క్శుచిః. | |