పీఠిక,
iXiX
| | చక్కిఁ దళుక్కు మన్న నెలజవ్వని మైసిరి యంచుఁ జూచు న | |
(విజయ. 3.5.)
ఇట్టివి మఱికొన్ని యున్నను గ్రంథవిస్తరభీతిచే నింతటితో విరమించితి.
ఈ గ్రంథమందు ఛందోవ్యాకరణలక్షణవిరుద్ధము లగుపెక్కుప్రయోగములు గనఁబడుచున్నవి గాని యీముద్రణమునం దవి చాలవఱకు ముద్రణాలయస్థపండితులచే మార్పఁబడినవి గాన నుదాహరింపలేదు. ఇట్టిదోషములు ప్రాచీనకవులగ్రంథములయందుఁ గూడఁ గానవచ్చుటంబట్టి యీకవి లాక్షణికుఁడు గాఁ డని మనము చెప్పలేము.
ఈరామాయణముయొక్క ప్రత్యాశ్వాసాంతమందును నానావిచిత్రబంధములతోఁ గూడిన పద్యముల నతినిపుణముగా వ్రాసియున్నాఁడు ఆరణ్యకాండములో రాముఁడు సీతను వెదకునపు డీకవి నానావిధచిత్రవృత్తరచనయందుఁ దన కున్నప్రావీణ్యమునంతయుఁ బ్రకాశింపఁజేసెను.
భాషాంతరీకరణము
భగవద్వాల్మీకిమహర్షి ముఖకమలనిరర్గళవినిస్సృతమకరందప్రవాహాయమానం బై చతుర్వింశతిసహస్రశ్లోకసంఖ్యాపరిమితం బై విరాజిల్లు మూలరామాయణము నిమ్మహాకవి యొక్కండే స్వప్నసాక్షాత్కృతశ్రీకృష్ణవరప్రసాదాధిగతనిరుపమానవిశృంఖలకవితామహిమంబున సహృదయహృదయంగమం బగురచనాఫణితి శోభిల్ల సమగ్రముగా నాంధ్రీకరించి శాశ్వతకీర్తిం బడసెను. ఇట్టిపని మిగులఁ దుష్కరము. ఏలయనఁగా:— కవులకు నొకగ్రంథమును స్వతంత్రముగా రచించుట సుకరము. స్వకృతియందుఁ దమకవితాపాటవమునకును బాండిత్యపరిమితికిని ననురూపము లగువర్ణనంబులను విషయములను నలవరించుకొని దానిని రచింపవచ్చును.భాషాంతరీకరణమందో యట్లు సేయ శక్యము గాదు మూలగ్రంథము ననుసరించి వ్రాయవలయును. నానావిధవర్ణనోపశోభితం బై తత్త్వప్రతిపాదకంబై యతిగంభీరార్థయుక్తం బై మధుమయఫణితీసమలంకృతం బై యొప్పారు నీరామాయణ మనునితిహాసరాజము నన్యూనాతిరిక్తముగా నాంధ్రీకరించుట మిక్కిలి దుష్కరము. అది సరసవచనరచనాధురంధరుఁ డగు నిట్టిమహాకవికిఁ గాని తదితరులు కలవిగాదు.
వాల్మీకి రామాయణమునకు మతత్రయపూర్వాచార్యు లనేకు లనేకవ్యాఖ్యానములను రచించిరి. వానిలోఁ గతక మహేశ్వరతీర్థీయ గోవిందరాజీయ వ్యాఖ్యానము లెన్నఁదగినవి. కతకవ్యాఖ్యాన ముత్తరహిందూస్థానమందేకాని మనదేశపువాడుకలో లేదు. మిగిలినమహేశ్వరతీర్థీయ గోవిందరాజీయ వ్యాఖ్యానములు రెండింటిలో విశిష్టాద్వైతుల దగుగోవిందరాజీయవ్యాఖ్యానము రసవత్తరమయినది. ఇంతరసవంత మయినవ్యాఖ్యాన మీప్రపంచమం దెచ్చటను గాన మని ప్రతిజ్ఞ చేయవచ్చును. వాల్మీకి రచించినమూల మెట్టిదో యీ వ్యాఖ్యాన మట్టిది. "పెరియ