Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lxviii

పీఠిక.

ఈకవి వ్రాసిన పద్యములయందుఁ గొంచెము పూర్వకవిచ్ఛాయలు గానవచ్చుచున్నవి.

"చ.

అటఁ జని కాంచె రామవిభుఁ డంబరచుంబిరసాలభూర్జరీ
కుటజతమాలతాలవటకుందకురంటకకోవిదారవి
స్ఫుటకరవీరలోధ్రతరుచూతమధూకవిశాలశింశుపా
పటలవిరాజితం బయినభాసురదానము భూరిదానమున్.”

(అర.)

"చ.

అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబిశిరస్సరజ్ఝరీ
పటలముహుర్ముహుర్లతదభంగతరంగమృదంగనిస్వన
స్ఫుటనటనానురూపపరిఫుల్లకలాపకలాపిజాలమున్
గటకచరత్కరేణుతరకంపితసాలము శీతశైలమున్."

(మను. 2.)

"క.

కలరవ మై జితజోకిల, కులరవ మై యారసం బకుంఠితగతి వీ
నులవిం దై యమృతిపుసో, నలపొం దై పురమునిండ నలువుగ మ్రోసెన్.”

(బాల.)

"క.

వీనులవిం దై యమృతపు, సోనలపొం దై యమందసుమచలదళినీ
గానముక్రం దై యాస్వన, మానందబ్రహ్మ మైన నధిపతి వల్కెన్.”

(వసు. 2.14.)

"సీ.

నేఁడుగా నా కనిందితయజ్ఞఫలవృద్ధి సఫలంబు మీరాక సంయమీంద్ర!
నేఁడుగా నాకు మానితజన్మసంసిద్ధి గలిగె మీకరుణచే గాధితనయ!
నేఁడుగా నేను భూనేతలలోఁ జాల మాన్యుండ నైతి నో మౌనివర్య!
నేఁడుగా నాకు నగ్నియు సమకూరె నీయాలోకనమునఁ బద్మాప్తతేజ!


తే.

బ్రహ్మతుల్యుండ వైననీపాదరజము, సోక నాయజ్ఞసదన మస్తోకభంగిఁ
గడుఁబవిత్ర మై తనరారెఁ గల్మషంబు, లడఁగె మిక్కిలిధన్యుండ నైతి నేఁడు.”

(బాల)

"సీ.

నేఁడుగా మాకనిందితపర్వసామగ్రి సవరించె నీరాక కువలయేశ!
నేఁడుగా మాతమోనివహంబు లడఁచె నీయాలోకమహిమ లోకైకమిత్ర!
నేఁడుగా మాకు నన్నియుఁ గూర్చె నభిమతార్థములు నీసన్నిధి రాజరాజ!
నేఁడుగా మాకు మానితసౌమనస్యంబు లొసఁగె నీపాదాప్తి వసుధరేంద్ర!


తే.

సురభిచరితుని నిన్ను నిచ్చో భజింపఁ
గాఁ గలిగెఁ గాని సఫలతాకలిత యై వె
లసె మదీయకాంతారాగలక్ష్మీ యింకఁ
దరమె మానాతిచిరభాగ్యగరిమఁ బొగడ.”

(వసు. 3.55.)

ఉ.

ఎక్కడ నల్కు డైనఁ దరళేక్షణ వచ్చు నటంచుఁ జూచు నే
యిక్కువఁ జప్పు డైనను మహీసుతపల్కని యాలకించు నే
దిక్కు తళుక్కు మన్న సుదతీమణిమైజిగిగాఁ దలంచు లో
నక్కజ మైనమోహమున నారఘునాథుఁడు భ్రాంతచిత్తుఁ డై.”

(అర.)

"ఉ.

ఎక్కడఁ జప్పుడైనఁ దరళేక్షణ వచ్చె నటంచు లేచు నే
దిక్కున నల్కు డైన సుదతీమణీమా టని యాలకించు నే