పీఠిక,
lXV
| | చతుర్వర్గఫలోపేతం చతురోదాత్తనాయకమ్, | |
ఆరంభమం దాశీర్వాదనమస్కారవస్తునిర్దేశరూప మగుమంగళాచరణములతోఁ గూడినదియుఁ, బ్రాచీనపురాణేతిహాసములనుండి తీయఁబడినకథగాని లేక సత్పురుషచరిత్రమును బ్రతిపాదించు కథగాని గలదియు, ధర్మార్దకామమోక్షరూపఫలములతోఁ గూడినదియుఁ, జతురుఁడు, కార్యదక్షుఁడు నగునాయకునితోఁ గూడినదియుఁ, బట్టణము, సముద్రము, ఋతువులు, చంద్రోదయసూర్యోదయాదులు, వనవిహారము, జలక్రీడ, మధుపానము, వివాహము, సంభోగశృంగారము, విప్రలంభశృంగారము, కుమారోత్పత్తి, ఆలోచనము, ద్యూతము, ప్రయాణము, యుద్ధము, నాయకాభ్యుదయము మొదలగువానివర్ణనలు గలదియునై యుండవలయును.
ఈగోపీనాథరామాయణముయొక్క ప్రారంభంబునందు భగవన్నమస్కారరూప మగుమంగళ మాచరింపఁబడెను. ఇందు ధర్మార్థకామమోక్షరూపఫలములు ప్రతిపాదింపఁబడుచున్నవి. ధీరోదాత్తనాయకుఁ డగురాముఁడు దీనికి నాయకుఁడు. దీనిలో బాలకాండమందు నగరవర్ణనము, సుందరకాండములో సముద్రవర్ణనము, చంద్రోదయవర్ణనము, కిష్కింధాకాండములోఁ దుదను సూర్యోదయచంద్రోదయవర్ణనము, అరణ్యకాండములో సీతారాములవనవిహారము, పరస్పరవియోగము, బాలకాండమందు సీతారాముల వివాహము, యుద్ధకాండములో యుద్ధవర్ణనము, శత్రువధచే నాయకాభ్యుదయము మొదలగునవి సమగ్రముగా నుదాహరింపఁబడెను.
కవిత్వవిమర్శనము
ఈమహాకవీశ్వరునికవిత్వ మతిసుకుమారసరసవచనగ్రథితము. రసవంతము. పండితపామరజనహృదయాకర్షక మయి శబ్దార్థాలంకారోపశోభితం బై యనతికఠిన మై, పాఠకుల కానందసంధాయక మయి యున్నది. చదువునపుడు సులభముగా నర్థమగుటచే నీకవిపుంగవుని కవిత్వము ద్రాక్షాపాకభరితము. “ద్రాక్షాపాకస్స కథితో బహిరంతస్స్ఫురద్రవః”. “లోపలఁ బైని ప్రకాశించురసము గలది ద్రాక్షాపాక మనంబడు ఉదా:—
| “ఉ. | పిన్నటనాఁటనుండియును బెక్కుసుఖంబుల వర్ధమాన యై | |