Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1xiv

పీఠిక.


బ్రహ్మకైవర్తపురాణంబులోఁ గృష్ణ
          జన్మఖండంబును జారుఫణితిఁ,
నాంధ్రభాష రచించినట్టిపుణ్యుండవు.”

అనుమాఘకావ్యపద్యమువలన రామాయణమును బ్రహ్మకైవర్తమును మొదట సర్వజ్ఞ కుమారయాచేంద్రునాజ్ఞచే రచించినట్లును, దరువాత నమ్మహీవల్లభుని జ్యేష్ఠపుత్త్రుం డగుగోపాలకృష్ణయాచేంద్రునాజ్ఞచే మాఘకావ్యమును రచించినట్లును, మాఘకావ్యమునఁ దెలియఁబడుచున్నవి.

కావ్యసామాన్యలక్షణము

"ప్రభుసమ్మిత శబ్దప్రధానవేదాదిశాస్త్రేభ్య స్సుహృత్సమితార్థతాత్పర్యసత్పురాణాదితిహాసేభ్య శ్చ శబ్దార్థయో ర్గుణభావేన రసాంగభూతవ్యాపారప్రవణతయా విలక్షణం యత్కావ్యం లోకోత్తరవర్ణనాని పుణ్యకవికర్మ కావ్యమ్.”

“ప్రభుసమ్మితములు, శబ్దప్రధానము లగువేదములకంటెను సుహృత్సమ్మితార్థము గలపురాణేతిహాసాదులకంటెను విలక్షణ మయినదియు, రావణాదులవలె గాక రామాదులవలెఁ బ్రవర్తింపవలె నని కాంతాసమ్మితముగా నుపదేశించునదియు, రసమున కంగ మైనవ్యంజనావ్యాపారముచే నప్రధానముగాఁ జేయఁబడిన శబ్దార్థములు గలదియు లోకస్వభావోత్తీర్ణ మగువర్ణనాశిల్పమందుఁ బ్రౌఢుఁ డైనకవియొక్క కర్మయు నగునది కావ్య మనంబడు.” “తదదోషా శబ్దార్ధౌ సగుణావనలంకృతీ పునః క్వాపి” (కావ్యప్రకాశిక.) "దోషరహితములు గుణయుక్తములు నగు శబ్దార్థములకుఁ గావ్య మనిపేరు" ఒకప్పు డలంకారములు లేకున్నను కావ్యమునకు భంగము లేదు. ఇట్టికావ్యము లుత్తమమధ్యమాధమభేదంబులచే మూఁడువిధములు, “ఇద ముత్తమ మతిశయిని వ్యంగ్యే వాచ్యా ద్ధ్వని ర్బుధైః కథితమ్” “వాచ్యముకంటె వ్యంగ్య మతిశయించియుండ నది యుత్తమకావ్య మనంబరఁగు. దీనికి 'ధ్వని'యని నామాంతరము.” “అతాదృశిగుణీభూతవ్యంగ్యం వ్యంగ్యేతు మధ్యమమ్” “వ్యంగ్యము వాచ్యముకంటె నతిశయింపని దై యుండ దానికి మధ్యమకావ్య మని పేరు. దీనికి 'గుణీభూతవ్యంగ్య' మని నామాంతరము.” "శబ్దచిత్రం వాచ్యచిత్ర మవ్యంగ్యమపరంస్మృతమ్” “శబ్దగుణాలంకారయుక్తము నర్థగుణాలంకారయుక్తము నై యల్పవ్యంగ్యోపేత మయి యుండునది యధమకావ్యము.” ఈయాంధ్రవాల్మీకిరామాయణ ముత్తమకక్ష్యలోనిదిగా గణింపఁదగినది. దీనియందుఁ బూర్ణముగా నగరార్ణవశైలర్తువర్ణనలతోఁ గూడినమహాకావ్యలక్షణము గూడఁ గన్పట్టుచున్నది.

మహాకావ్యలక్షణము

"ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశోవాఽపి తన్ముఖమ్,
ఇతిహాసకథోద్భూత మితర ద్వా సదాశ్రయమ్.