Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అయోధ్యా మటవీం నిద్ధి గచ్ఛతాత! యథాసుఖమ్.”

(అయో. 7. 11.)

"పుత్త్రా! నీవు సుహృజ్జనంబునందుఁ బరమానురక్తుండ వైనను వనవాసంబుకొఱకు ... ...


గీ.

... ... భూరిసుఖలీల నడవికిఁ బోయి రమ్ము.”

(గోపీ. అయో. 854-855)

ఇ ట్లీమె తనకొడుకు సవతికొడుకు ననుభేదబుద్ధి లేని దగుటచేతను రామునియం దధికతరవాత్సల్యము గలది యగుటచేత నీచాడ్పునఁ దనసుతుని కుపదేశించి యడవికిఁ బంపెఁగాని లోకములో నెవ్వతెయైన నీరీతి సర్వసంపత్సమద్ధం బగు స్వగృహంబును విడిచి సపత్నీసోదరునికిఁ బరిచర్యఁ జేయుచు నతనివెంట నడవికిఁ బొమ్మని తనకుమారునికి బోధించునా? ఈమె నిష్పక్షపాతబుద్ధి రాజభక్తి స్వార్థపరిత్యాగపూర్వకపరార్థప్రవృత్తియు మిక్కిలిశ్లాఘనీయములు

కైకేయి

ఈమె కేకయరాజపుత్త్రిక. దశరథుని మూఁడవభార్య. అతని కత్యంతప్రేయసి. ఈమెతో నుపయమము దశరథుని కుపయమవాసము నొసంగెను. ఈమె పన్నినదుర్నాటకమునం దీమె తాల్చినభూమికయే రామాయణకథ నింతగాఁ బెంచెను. ఈమె మిగులఁ గఠినాత్మురాలు, క్రూరనిశ్చయురాలు. రామవివాసనమునకే కాక దశరథమరణమునకుఁ గూడ ముఖ్యకారణము . ఈకైకేయితల్లియు నిజభర్తృమరణమునకుఁ దానే కారణమయ్యె. "అవశ్యం పితురాచారః” అన్న ట్లీమెకూడ నట్లనే చేసెను. మంథర యనునొకక్రూరదాసిచే బోధింపఁబడి దశరథుఁ డెప్పుడో పూర్వమందుఁ దనకు వాగ్దానముఁ జేసి తరువాత మఱచిపోయిన రెండువరముల నాతనికి జ్ఞప్తికి దెచ్చి "అది బొంకితివా నరకమునఁ బడుదువు, మీపూర్వులందఱు సత్యసంధులు. అనృతముఁ బలికినవారు కారు. నీవలన నీవంశమున కంతకు నపయశస్సు వాటిల్లును. నీవు చేసినప్రతిజ్ఞ నిర్వహింపవలయు నని నీ కిచ్చయున్న యెడల నిపుడు సిద్ధ మగురాజ్యాభిషేకమును నాసుతుఁ డగుభరతునికిఁ జేసి రామునిఁ బదునాలుగేం డ్లరణ్యములో నుండ నియమింపు" మని గట్టి పట్టుపట్టి దశరథుఁడు లోనగువా రెవ్వ రెన్నివిధముల నయభయముల బోధించినను వినక యతికఠినతను మౌఢ్యమును వహించి కొనకు సజ్జీకృత మైనరామపట్టాభిషేకము నాఁపివైచి రామునిఁ బ్రవ్రజింపఁజేసి సర్వలోకనిందాపాత్రురా లయ్యెను.

"న విశేషేణ న శస్త్రేణ నాగ్ని నా న చ మృత్యునా,
అప్రతీకారపారుష్య స్త్రీభి రేవ స్త్రియః కృతాః.”

అన్నట్లు ఆహా! స్త్రీ లెంతక్రూరులు? క్రూరస్వభావమం దీమెను మించినస్త్రీలు లోకములో మఱి లేరని దృఢముగాఁ జెప్పవచ్చును. ఈ కథాసందర్భములో నీమెకు దశరథునికి జరిగిన యుక్తిప్రత్యుక్తులఁ గనుఁగొనుఁడు.

"తతః పర మువా చేదం వరదం కామమోహితమ్
... ... ... ... ... ...
తస్యైవ త్వ మనర్థాయ కి న్నిమిత్త మిహోద్యతా.”

(అయో. 11–12. సర్గ)