Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావికాలమున వీరు పెద్దపెరిగి ప్రాజ్ఞులై సకలవిధముల సంరక్షణఁ జేయుదు రనుప్రత్యాశతోఁ దనయులఁ బడయుదురు. కౌసల్య యట్లు గాదు. స్వార్థపరత నొకమూలకుఁ ద్రోసి సర్వలోకరక్షణార్ధ మయి రామునిఁ గనె నఁట! ఈమె దశరథుని పట్టమహిషి. మహాపతివ్రత. భర్తృసేవాపరాయణురాలు. దశరథునికి సమ్మానపాత్రురాలు. కైకేయి రాము నడవికిఁ బంపుమని ప్రేరణచేయునపుడు దశరథుఁడు పలికినపలుకులు కౌసల్యపై నతని కున్న గౌరవాభిమానములం దెలుపుచున్నవి.

"కిం మాం పక్ష్యతి కౌసల్యా రాఘవే వన మాస్థితే
... ... ... ... ...
అపథ్యవ్యంజనోపేతం భుక్త మన్న మి వాతురమ్"

(అయో. 12. 61½-70½)

"సీ.

అనిశముఁ బ్రియపుత్రయును ... ... ...


గీ.

... ... నపథ్యభోజ
నంబు విషరోగినింబలె నాతి నేఁడు.”

(గోపీ. అయో. 322.)

రామునిపట్టాభిషేకము నిర్విఘ్నముగా జరుగుటకు నాతని మాంగల్యము వృద్ధినొందుటకు ననేకవ్రతములు నోములు పుణ్యకర్మములు సలుపుచు నాతని యభ్యుదయాభివృద్ధికొఱకు నిరీక్షించుచున్న యీమెతో "అమ్మా! యీరాజ్యమును మాతండ్రి కైకేయిప్రార్థనచే భరతుని కీయ నిశ్చయించి న న్నరణ్యమునకుఁ బోవ నాజ్ఞాపించెఁ గావున నే నరణ్యంబునకుఁ బోయివచ్చెద సెలవిచ్చి పంపు" మని రాముఁడు పలుకఁగా నీమె —

"సా నికృత్తేన సాలస్య యష్టిః పరశునా వనే
సపాత సహసా దేవీ దేవ తేన దివ శ్చ్యుతా.”

(అయో. 20.32.)

అన్నట్లు మూర్ఛ నొంది కొంతసేపటికిఁ దెలివి దెచ్చుకొని యనేకవిధముల విలపింపఁదొడఁగె. రాముఁడు వనమునకుఁ బోకుండ బహుప్రకారముల బోధించెను; గాని యాతఁడు వినఁడయ్యె. అపు డీమె —

"అ పీదానీం సకాల స్స్యా ద్వనా త్ప్రత్యాగతం పునః
యత్త్వాం పుత్త్రక! పశ్యేయం జటావల్కలధారిణమ్.”

అని కోరెను. ఈరీతి నీమె పుత్రవియోగమువలనఁ బొందిన దుఃఖము చెప్ప నలవి కాదు.

సుమిత్ర

ఈమె దశరథుని రెండవభార్య . లక్ష్మణశత్రుఘ్నుల తల్లి. భర్త్రనువ్రత. గుణవతి. రామునియం దధికప్రీతి గలది. రామునితో నేను గూడ నరణ్యమునకుఁ బోయెద నని లక్ష్మణుఁ డీమెతోఁ జెప్ప రాఁగా నీమె యి ట్లుపదేశించెను.

"పృష్టస్వం వనవాసాయ స్వనురక్త స్సుహృజ్జనే
... ... ... ... ...