పీఠిక.
lvii
"నిత్యశత్రుఘ్నః” శరీరమం దుండి యెల్లపుడు విషయాంతరప్రావణ్యమును గలిగించునవి యగుటచే శత్రువు లగుజ్ఞానేంద్రియములయుద్రేకము నణఁచువాఁడు. ఇంద్రియనిగ్రహము గలవాఁడు.
“నీతః” “తీసుకొని వెళ్లఁబడెను” గాని స్వయముగాఁ బోలేదు. ఇందువలన నచిత్తువంటి పారతంత్య్రము గలవాఁ డనుట.
"ప్రీతిపురస్కృతః" విధిప్రేరితుఁ డై వెళ్లలేదు, ప్రీతిప్రేరితుఁ డై వెళ్లెను. ఇందువలనఁ జిద్వ్యావృత్తి ప్రతిపాదింపబడినది. ఇందువలన సారగ్రాహి యగుపురుషుఁడు శత్రుఘ్నునివలె భాగవతపరతంత్రుఁ డై యుండవలె నని వ్యక్త మగుచున్నది —
దశరథుఁడు
ఇతఁడు రామునితండ్రి. పరమధార్మికుఁడు. సత్యసంధుఁడు. ఇక్ష్వాకువంశపురాజులలోఁ బ్రసిద్ధి కెక్కినవాఁడు. అనేకాశ్వమేధముల నొనర్చినవాఁడు. తనపూర్వులు పాలించినరీతిగా న్యాయముతోఁ బ్రజలఁ బాలించి కొనకు విశ్రాంతి నొందఁగోరి జ్యేష్ఠపుత్రుఁ డైన రాముని రాజ్యమునకు రాజుగాఁ జేయం దలంచి యొకనాఁడు పౌరుల రావించి వారితోఁ దనయభిప్రాయము నిట్లు తెలియఁ జేసెను.
| | "మయా ప్యాచరితం పూర్వైః పంథాన మనుగచ్ఛతా | |
(అయో. స.2.)
| తే. | అట్టి యిక్ష్వాకుకులమునఁ బుట్టినట్టి, | |
| తే. | ... ... ... ... ... ... | |
(గోపీ. అయో. 51-53 )
దశరథుఁడు ప్రజలతో నీరీతి నాలోచించి రామునికిఁ బట్టముఁ గట్టుటకు< నిశ్చయించెను. ఇంతలో మంథరాప్రేరితురా లగుకైకేయి పూర్వ మీతఁడు తనకుఁ జేసినవరదానప్రతిజ్ఞ నిపుడు నిర్వహింపవలయునని నిర్బంధింపఁగా ననృతవాదమున కోడి సత్యమును నిలువఁబెట్టికొనువాఁ డై సకలకల్యాణగుణాకరుఁ డగురాముని వనమునకుఁ బంపి తద్వియోగార్తిచేఁ బ్రాణములు విడిచెను గాని తా నన్నమాటనుండి తిరుగఁజాలకపోయెను. కామాతురుఁ డగుటచే గ్రూరహృదయురా లగుకైకేయికి లోఁబడి యట్టికుమారు నడవి కంపినయవివేకి యని లోకు లీతని నిందింతురు; గాని మన మీతనిసత్యవ్రతపరిపాలనమునకు మెచ్చుకొనక తీరదు.
కౌసల్య
ఈమె సప్తలోకైకవీరుఁ డగు రాముని గన్నతల్లి. “కౌసల్యా లోకభర్తారం సుషువే యం మనస్వినీ” అన్నట్లు సాధారణముగా లోకములోఁ దల్లులు తమకు