Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1vi

పీఠిక.


"లంకేశ్వరప్రణతభంగదృఢవ్రతం త
ద్వంద్యం యుగం చరణయో ర్జనకాత్మజాయాః
జ్యేష్ఠానువృత్తిజటిలం చ శిరోఽస్య సాధో
రన్యోన్యపావన మభూ దుభయం సమేత్య.”

(రఘు. స. 13.78)

"మ.

దశకంఠప్రణతిప్రయోగవితతిధ్వంసైకబద్ధవ్రతం
బశుభోచ్ఛేదక మైనయయ్యవనిజాహార్యంఘ్రియుగ్మంబునా
ప్రశమస్వాంతుని కైకయీసుతు జటాబద్ధోత్తమాంగంబునన్
భృశసంయుక్తము లై పరస్పరగతిన్ బెంచెన్ బవిత్రస్థితిన్."

శత్రుఘ్నుఁడు

లక్ష్మణుఁడు రామానువర్తనపరుఁ డైనట్లు శత్రుఘ్నుఁడు భరతానువర్తనపరుఁడు. లక్ష్మణుఁడు భగవచ్ఛేషభూతుఁడు. శత్రుఘ్నుఁడు భగవచ్ఛేషత్వమునకుఁ బరమావధి యగుభాగవతశేషత్వము గలవాఁడు.

“గచ్ఛతా మాతులకులం భరతేన తజాఽనఘః
శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతిపురస్కృతః.”

(అయో. 1. 1.)

ఇచట “గచ్ఛతా” అనువర్తమానకాలమును దెలియఁజేయు శతృ ప్రత్యయముచే భరతునితో నేకకాలమునందే శత్రుఘ్నుఁడు పోవుచున్నాఁడు. కావున నసివసనాదులవలె భరతునికి శత్రుఘ్నుఁడు గూడఁ బరతంత్రుఁడని తెలియఁబడుచున్నది.

"మాతులకులం” ఇచట ద్వితీయచే భరతోద్దేశ్యమే శత్రుఘ్నోద్దేశ్య మని యెఱుంగునది.

“భరతేన”. రామలక్ష్మణులు వనమున కరుగ దశరథుఁడు స్వర్గము నొందఁగాఁ గేవల రామాజ్ఞచే రాజ్యభారమును నిర్వహించుటవలన భరతుఁ డని పే రొదవె.

“తదా”="భరతగమనకాలమందు" ఇందువలన శత్రుఘ్నుని కనుకూల మయిన చంద్రతారాబలాదులతోఁ గూడిన ముహూర్తము నపేక్షింపకపోవుటచే నత్యంతపారతంత్ర్యము ద్యోతిత మయినది.

"అనఘః”="అఘము లేనివాఁడు." ఇచట నఘ మనఁగా రామభక్తి. తనకు శేషి యగుభరతునికి రామభక్తి యిష్టము గావునఁ దనకు రామభక్తి రుచించినది. అట్లు గానిచో రుచింప దనుట. అనిష్టమును గలుగఁజేయునది పాప మనఁబడును గావునఁ దనకు శేషియగుభరతుని కుద్దేశ్యము గానియపుడు రామభక్తి తన కనిష్టావహ మగుటచే నఘమని చెప్పఁబడుచున్నది. "సుకృతదుష్కృతే విధూనుతే — అస్య సర్వే పాప్మానః ప్రదూయంతే — ఉభే విద్వాన్పుణ్యపాపేవిధూయ” ఇత్యాదిశ్రుతులయందు ముముక్షువుకుఁ బుణ్యమువలెఁ బాపమును ననిష్టావహము గావునఁ బాపశబ్దవ్యవహారము.

"శత్రుఘ్న!”. ఇతఁ డిఁకముందు లవణాద్యసురులను జంపు నని వసిష్ఠునిచే నుంచఁబడినపేరు గలవాఁడు.