పీఠిక.
lv
అన్నట్లు పగ లైనచో లోకులు దన్నుఁ జూచి "వీనివలననే రాజుకుటుంబమున కిట్టి యనర్థము సంభవించె" వని నిందింతు రని భయపడి మధ్యరాత్రములయందు సరయూనదికిఁ బోయి స్నానమాడెడువాఁడై కాలముఁ గడపెను. ఇతఁడు రాముఁడు లేని పదునాలుగేండ్లు నయోధ్యఁ బ్రవేశింప నొల్లక నందిగ్రామమం దుండి రాజ్యము చేసెను గ్రామమం దున్న యితనికంటె నరణ్యమం దున్నరాముఁడే నూఱింతలు సుఖవంతుఁ డై యుండెనని చెప్పవచ్చును. ఇతఁడో యనవరతవ్రతకర్శితుఁ డై దుఃఖసంతప్తుఁ డై యుండె. రామునికి లక్ష్మణునియందుకంటె నితనియం దధికతరప్రీతి గలదు. రాముఁడు తిరుగ నయోధ్య కేతెంచినపుడు భరతుఁడు —
| | "పాదుకే తే తు రామస్య గృహీత్వా భరత స్వయమ్ | |
(యుద్ధ. 130. 52-55.)
| "చ. | భరతుఁడు హేమరత్నమయపాదుక లెంతయు ... ... | |
| ఉ. | ... ... ... ...గోష్టకో | |
అని సవినయంబుగా రామునితో విన్నవించి
| | "పూజితో మామికా మాతా దత్తం రాజ్య మిదం మమ | |
(యుద్ధ. 131. 2–5.)
| "సీ. | రఘుకులోత్తమ! నీవు రాజ్యంబు విడనాడి ... ... | |
(గోపీ. యుద్ధ. 3232-3234)
ఇట్లు ప్రార్థించి రాజ్యము నాతనికిఁ బ్రత్యర్పణముఁ జేసె.
పట్టాభిషేకానంతరము రాముఁడు యౌవరాజ్యము నంగీకరింపు మని లక్ష్మణుని బతిమాలిన నతఁ డిష్టపడకపోవుట చేత భరతుని యౌవరాజ్యమం దభిషిక్తునిఁ జేసె.
| | "సర్వాత్మనా పర్యనునీయమానో యదా న సౌమిత్రి రుపైతియోగమ్ | |
(యుద్ధ. 191-95.)
| "ఉ. | నావిని లక్ష్మణుండు నరనాథునిఁ గన్గొని భక్తి నిట్లనున్ | |
(యుద్ధ. 3344.)
ఈరీతిగా భరతుఁడు భువనేడ్యగుణుఁడు. కాళిదాసుఁడు భరతునిగుఱించి రఘువంశములో నీపగిది వ్రాసెను.