lii
పీఠిక.
| | "కి న్ను కార్యం హత స్యేహ మమ రాజ్యేన శోచతః | |
(అయో. 73. 12-15)
| "ఆ. | అకట! తండ్రి చేత నలతండ్రి కెనయైన | |
| తే. | ... ... ఫణిని జే నంటి యజ్ఞుఁడు పడిన పగిది.” | |
(గోపీ. అయో. 1495-1499.)
అంత శత్రుఘ్నుఁడు తీవ్రకోపావిష్ణుఁ డై
| | "స చ రోషేణ తామ్రాక్ష శ్శత్రుఘ్న శ్శత్రుతాసనః | |
(అయో. స. 78)
“జుట్టుఁ బట్టుకొని లాగి మంథరను నేలపైఁ బడఁద్రోచి చంపుట కుద్యుక్తుఁ డయ్యె కైకేయినిగూడ దుఃఖకరము లగుపరుషభాషణములచే నిందించి కొట్టుట కుద్యోగించుచుండ నామె భయపడి కుమారునిమఱుఁగుఁ జొరఁగా స్త్రీలను జంపఁగూడదని చెప్పి భరతుఁడు కుపితుఁ డైనశత్రుఘ్నుని నివారించి యిట్లనియె."ఓయిశత్రుఘ్నుఁడా! దుష్టురా లగునీకైకేయిని నేనే చంపఁదలంచితిని గాని పరమధార్మికుఁ డగురాముఁడు నేను మాతృహత్యఁ జేసితి నని తెలికొని నాముఖముఁ జూడఁ డని యాపనినుండి విరమించితి. ఈమంథరనైన మనము చంపినయెడల రాముఁ డిఁక మనతో సంభాషింపఁడు. కావున నూరకుండుము” ఇందువలన భరతునికి రామునియం దున్నపరమభక్తి స్పష్ట మగుచున్నది.
అపుడు భరతునికంఠధ్వని విని కౌసల్య భరతునియొద్దకు వచ్చి మిక్కిలిదుఃఖముతో
| | "ఇదం తే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్త మకంటకమ్ | |
(అయో. 75. 11–16)
"క్రూరకర్మురా లగునీతల్లి నీకొఱకు ధనధాన్యసమృద్ధము నిష్కంటకము నగురాజ్యమును సంపాదించినది. శీఘ్రముగా దాని నంగీకరింపు" మని పుండులో సూదిఁ బెట్టి పొడిచిన ట్లిదివఱకే యతిదుఃఖితుఁ డై యున్న భరతునిమనస్సు నొచ్చునటుల నిష్ఠురోక్తులఁ బలికెను. అంత భరతుఁ డామెపాదములపైఁ బడి దుఃఖావేగవివశుఁ డై మూర్ఛ నొంది కొంతవడికి లబ్ధసంజ్ఞుఁ డై "
| | ఆర్యే! కస్మా దజానంతం గర్హసే మా మకిల్బిషమ్ | |
(అయో. 75. 20-68.)