Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

Ii


"సీ.

ననుఁ దల్లినట్లు రామునిఁ దండ్రి నట్లు సం
          భావించి యెవ్వాఁడు భక్తి సలుపు
... ...దండితారాతిధీరుండు పండితుండు.”

(గోపీ. సుంద. 924-9-6)

“దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః"

(యుద్ద. 102-13)

"ప్రతిదేశమందును భార్యలను బంధువులను సంపాదింపవచ్చును. గాని యెచ్చటను సహోదరుని సంపాదింపఁజాలము." అని లక్ష్మణమూర్ఛలో రాముఁడు చెప్పినమాటను బట్టి విచారింపఁగా రామునికి సీతకంటె లక్ష్మణుఁడు ప్రియతరుఁ డని తేలుచున్నది. రామునితో నరణ్యమం దున్నపదునాలుగేండ్లు లక్ష్మణుఁ డాహారనిద్రల వర్జించె నని లోకప్రవాద మొకటి గలదు. గాని శ్రీరామాయణమం దట్లు గానరాదు సరేకదా మీఁదుమిక్కిలి లక్ష్మణుఁడు గొట్టితెచ్చిన మృగములు మాంసములను సీత రామునితో లక్ష్మణునికి వడ్డింపఁగా భుజించినట్లు ప్రమాణము గానవచ్చుచున్నది.

“అగ్రే ప్రదాయ భూతేభ్య స్సీతాఽథ వరవర్ణినీ
తయో రుపాదదే భ్రాత్రో ర్మధుమాంసంచ తద్భృశమ్.
తయో స్తుష్టి మ థోత్పాద్య వీరయోః కృతశౌచయోః
విధివ జ్జానకీ పశ్చా చ్చక్రే తత్ప్రాణధారణమ్.”
"తత స్తత్ర సుఖాసీనౌ నాతిదూరే నిరీక్ష్యతామ్
న్యగ్రోధే సుకృతాం శయ్యాం లభేతే ధర్మవత్సలౌ."

(అయో. 53.)

భరతుఁడు

ఇతఁడు రామభక్తాగ్రగణ్యుఁడు. కైకేయీపుత్రుఁడు. శాంతి, దాంతి, తితీక్ష, భూతమైత్రి, విషయవైరాగ్యము మొదలగుననేకాత్మగుణములు గలవాఁడు. రామాయణకథాపురుషులలో రామునితరువాత యోగ్యుఁడుగా నెన్నఁదగినవాఁ డితఁడే. రాముఁడు వనవాసమునకుఁ బోయినపు డితఁ డయోధ్యలో లేఁడు. శత్రుఘ్నునితోఁ గలసి మాతామహుఁ డగుకేకయరాజు గృహమునకుఁ బోయియుండెను. కైకేయిదురాలోచనచే రామునిపట్టాభిషేక మాఁగిపోవుట, రాముఁ డడవి కేఁగుట, పుత్రవియోగదుఃఖముచే దశరథుఁడు స్వర్గగతుఁ డౌట భరతుఁ డెఱుఁగఁడు. దశరథమరణానంతరము వసిష్ఠునియాజ్ఞచే దూత లశ్వపతియొద్దకుఁ బోయి భరతునిఁ దోడి తెచ్చిరి. మార్గమం దనేకాపశకునములఁ జూచి స్వజనక్షేమశంకాపర్యాకులుఁడై నిరానంద మై యున్నయయోధ్యను బ్రవేశించి తొలిని బితృదర్శనోత్కంఠచేఁ బితృభవనమునకుఁ జని పితృకాననతుల్య మగునచ్చోటఁ దండ్రిని గానక తల్లియొద్దకుఁ బోయెను, పితృమరణము, రామవివాసనము మొదలగువృత్తాంతమునంతయుఁ గైకవలనఁ దెలిసికొని శోకసాగరనిమగ్నుఁ డై మూర్ఛిల్లి యెట్టకేలకుఁ దెలివిఁ దెచ్చుకొని తల్లి నిట్లు నిందింపసాగెను.