Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1

పీఠిక.

యము నూహించి బాగుగఁ బర్ణశాలను రచించినలక్ష్మణునిఁ జూచి రాముఁడు మిక్కిలి సంతోషించి కౌఁగిలించుకొని యిట్లనియె. "లక్ష్మణా! నేను సీతతోఁ గూడి రహస్యమందు వర్తించుట కిమ్మైనస్థల మొకటి నిర్మించుమని చెప్పుటకు లజ్జించి యూరకున్నను నాయభిప్రాయమును గనిపెట్టి యట్టియిమ్మైన స్థలము నేర్పఱిచినాఁడవు. అందుచే భావజ్ఞుఁడవు నాయం దుండెడునత్యాదరముచే మనతండ్రి యగుదశరథుఁడు నాచంద్రతారాబలముల నరసి యెట్లు నా కొకగృహము గట్టించెనో యాప్రకారమే నీవు నిపు డొనర్చితివి. కావున మనతండ్రి పనులు చేయించురీతిని కూడ నెఱింగినవాఁడవు నీవును రాజపుత్రుఁడ వయియున్నను నీ వుండుట కుచితమైనస్థలము నేర్పఱిచికొనక రామునియిష్టము వచ్చినటుల నే నుండవలయునని తెలిసికొన్నవాఁడవు గావున ధర్మజ్ఞుడఁవు. ఎల్లపుడు మదిష్టసంపాదనమే తనను నరకమునుండి దాఁటించునని తలంచుచుండు మనతండ్రి తనకు శక్తి యున్నంతవఱకు నాయిష్టమును చేసి తుదకుఁ దనచరమదశయందుఁ బానీయశాలాప్రవర్తకునివలె ని న్నేర్పఱచి యుంచి తాఁ జనియె. కావున మాతండ్రి మృతి నొందలేదు. నీవే మాతండ్రివి. మాతండ్రి నీద్వారా నాసర్వాభిలషితములను సంపాదించుచున్నాఁ డని శ్లాఘించెను. సీత కూడ హనునుంతునితో మాట్లాడినపుడు లక్ష్మణు నిట్లని స్తుతించెను.

"నియుక్తో ధురి యస్యాం తు తా ముద్వహతి వీర్యవాన్
యం దృష్ట్వా రాఘవో నైవ వృత్త మార్య మమస్మరేత్."

(సుందర. 28.)

తే.

రాముఁ డెవ్వానిఁ కార్యభారంబునందుఁ
దగ నియోగించినను దానె దానిఁ దాల్చు
గరిమ నెవ్వానిఁ గాంచి రాఘవుఁ డతీతుఁ
డైనతండ్రిని దలపోయఁ డనుదినంబు”

రావణుఁడు కొనిపోవుచుండఁగా సీత తననగలను మూటకట్టి హనుమత్సుగ్రీవాదు లున్నఋశ్యమూకముపైఁ బడవైచెను. తరువాత రామునితో సఖ్య మొనర్చినసుగ్రీవుఁ డాయాభరణములను రామునికిఁ జూపఁగా రాముఁడు లక్ష్మణునిఁ బిలిచి మీవదినె ధరించునీనగల నానవాలు పట్టఁగలవా యని యడిగినపుడు

"నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్."


"గీ.

అధిప! యీకమనీయ ... ...
... ... ...లెరుంగుదు మహాత్మ!"

(గోపీ. కిష్కి. 209.)

అని ప్రత్యుత్తర మిచ్చెను. ఆహా! లక్ష్మణుఁ డెట్టిజితేంద్రియుఁడు. ఇందువలన లక్ష్మణుఁ డెన్నఁడును గన్నెత్తి సీతమొగము నైనఁ జూచి యెఱుంగఁ డని స్పష్ట మగుచున్నది. ఈలక్ష్మణునియందుఁ బుత్త్రభావము గలసీతగూడ నీతని నిట్లు శ్లాఘించెను.

"స్రజశ్చ సర్వరత్నాని ప్రియాయా శ్చ నరాంగనాః ... ...
మృదు ర్నిత్యం శుచి ర్దక్షః ప్రియో రామస్య లక్ష్మణః.”

(సుంద. 34. 57-64.)