Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xlviii

పీఠిక.

అని ప్రమాణముఁ జేయఁగా “విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీష్వ రాఘవ"! అని లోకులందఱు హర్షించి చెప్పిరి. అపుడు రాముఁడు

"అనశ్యం త్రిషు లోకేషు న సీతా పాప మర్హతి,
దీర్ఘకాలోషితా హీయం రావణాంతఃపురే శుభా.
బాలిశః ఖలు కామాత్మా రామో దశరథాత్మజః,
ఇతి వక్ష్యంతి మాం సంతో జానకీ మవిశోధ్య హి."

(యు. 121. 13-14 )

"సీత పాపరహితురా లని నే నెఱుంగుదు. చిరకాలము రావణునియింట నున్నయీమెను నేను బరీక్షింపక స్వీకరించితి నేని లోకులు నన్ను నిందింతురు. అందువలన నీమెచే నిట్లు ప్రమాణముఁ జేయించితి”నని చెప్పి యామెను బరిగ్రహించెను. తా నెంతపరిశుద్ధుఁ డయ్యును తనపరిశుద్ధివిషయమై శంకించుటకు లోకుల కవకాశము గలుగఁజేయకుండ సత్పురుషుఁడు ప్రవర్తింపవలయు ననునీతిని రాముఁ డిందువలన లోకమునకుఁ గఱపెను. ఇట్లు రాముని సద్వృత్తము నామూలాగ్రముగా విమర్శించినచోఁ బితృమాతృభక్తి, సౌభ్రాత్రము, ఏకపత్నీవ్రతము, సత్యము, ప్రజ్జాస్థైర్యము, స్థానక్రోధత్వము, సర్వభూతదయ, సర్వభూతసమత్వము, ప్రియవాదిత్వము, క్షాంతి, స్వార్థపరిత్యాగపూర్వకపరోపకృతి మొదలగునసంఖ్యాకములగు సద్గుణములు గానవచ్చుచున్నవి. వీని నన్నిటి నామహాపురుషుఁడు లోకమున కుదాహరణముగాఁ జూపెను.

లక్ష్మణుఁడు

ఇతఁడు సుమిత్రాపుత్త్రుఁడు, సపత్నీసోదరుఁ డైనను బాల్యమునుండియు రామునియందు నిర్వ్యాజ మగుభక్తి, యనురాగము, ప్రేమయుఁ గలవాఁడు.

"బాల్యా త్ప్రభృతి సున్నీగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః, ... ...
లక్ష్మణో లక్ష్మిసంపన్నో బహిఃప్రాణఇవాపరః."

(బాల. 18. 27-28.)

"మ.

ఘనుఁడున్ స్నిగ్ధుఁడు ... ...
... ... రహిం దగె బహిఃప్రాణంబుచందంబునన్.”

(గోపీ. బాల. 433.)

అట్లే రాముఁడును బిన్ననాఁటనుండియు లక్ష్మణునియం దత్యంతవాత్సల్యము సోదరప్రీతియుఁ గలవాఁడై విహారశయ్యాసనభోజనాదులయం దొకత్రుటికాల మయిన నతనివిరహము సహింపలేనివాఁ డయియుండెను.

"న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః,
త దైనం పృష్ఠతోఽన్వేతి స ధనుః పరిపాలయన్.

(బాల. 18. 29-30.)

"క.

సొంపార రామభద్రుఁడు ... ... ...


క.

 ... .వీరుఁడు లక్ష్మణుఁడు పోవు వెనుకొని ప్రీతిన్."

(గోపీ. బాల. 433-434.)

ఇట్లు బాల్యమునుండియు రామలక్ష్మణు లిరువురు నన్యోన్యానురక్తు లై యుండిరి. రామునిపట్టాభిషేకము విఘ్న మయినపు డీలక్ష్మణుఁ డత్యంతకోపోద్దీపిత