పీఠిక,
xlvii
| | "స్వామీ యుద్ధమందు మూర్ఛితుఁ డైనయట్టి శత్రువును “విశ్రమింపు" మని సెలవిచ్చి విడిచితివి. అహో! యీనీగుణ మెట్టిది? దీని నెవ్వరు నుతింపఁగలరు?" | |
ఈమహాపురుషుని మహోదారత, ఆశ్రితవాత్సల్యము, విమృశ్యకారిత్వము సకలశాస్త్రవైచక్షణ్యము, సనాతనధర్మానువృత్తి, సర్వభూతానుకంప మొదలగు సద్గుణము లన్నియు విభీషణశరణాగతియందుఁ గన్పట్టుచున్నవి. రావణవధానంతరము విభీషణునిచేఁ దనయొద్దకుఁ దీసికొని రాఁబడినసీతను జూచి —
| | "ప్రాప్తచారిత్రసందేహా మమ ప్రతిముఖే స్థితా, | |
(యు. 118 17-18.)
| | "పరగృహవాసముచే జనించిన చారిత్రసంశయము గలనీవు నేత్రరోగికి దీపమువలె నాకుఁ బ్రతికూలురాల వగుచున్నావు.” | |
అని రాముఁడు కోపముతోఁ బలికెను. ఏలయన, రావణభవనమం దున్న పదిమాసములు సంస్కారహీనురా లయి యుండుటచే “మలపంకధరాం దీనామ్” అన్నట్లు సీత మలినవస్త్రముతోను మలినశరీరముతో నుండెను. అట్టియవస్థలో నున్నసీతను జూచుటకు రాముఁడు గోరెను గాని పైకి నలుగురు వినునట్లు —
| | “దివ్యాంగరాగాం వైదేహీం దివ్యాభరణభూషితామ్, | |
(యు.117.7.)
| | "శిరస్స్నానము చేయించి నగలతో నలంకరించి సీత నిటకు శీఘ్రముగాఁ దోడ్కొ నిరమ్ము” | |
అని విభీషణుని కాజ్ఞాపించెను. విభీషణుఁడు సీతతో భర్తృభిప్రాయమును దెలుపఁగా నామె రాముని మనమును బాగుగ నెఱింగినది గావున "అస్నాతా ద్రష్టు మిచ్ఛామి భర్తారం రాక్షసాధిప!” “ఓయి విభీషణా! నీవు స్వామి యభిప్రాయ మెఱుంగవు నీతో నాతఁడు నన్ను స్నానము చేయించి యలంకరించి తీసుకొని రమ్మని చెప్పినమాట సమనస్కముగాఁ జెప్పినది కాదు కావున నీమలినావస్థతోనే భర్తసన్నిధికి వచ్చెదను తీసికొని వెళ్ళు" మని చెప్పినను విభీషణుఁడు స్వామి యాజ్ఞ యిచ్చి రని నిర్బంధించి యామె కభ్యంగస్నానము చేయించి తీసికొని వెళ్లేను. కాని మలినావస్థలో నున్నసీతను జూచుట కపేక్షించిన రాముని కది కోపకారణ మయ్యెను రాముఁడు సీతయొక్క పారిశుద్ధ్యము నెఱింగినవాఁడైనను, పరగృహమందుఁ గొంతకాల ముండుటచే నామెచారిత్రమునుగుఱించి లోకులకుఁ గలుగు సంశయమును దీర్చుటకై యామె యగ్నిప్రమాణముఁ జేయునట్లు కొన్ని పరుషోక్తులను బలికెను. అందుపై నామె యగ్నిలోఁ బడి —
| | "కర్మణా మనసా వాచా యథా నాతిచరా మ్యహమ్, | |
(యు. 120. 24–26)