రామునిఁ జూచుటకు భరతునితో వచ్చిన ఋషులలో నొక్కఁ డగుజాబాలి యనుఋషి, వనవాసము చేయుటయందు రామునికిఁ గలపట్టుదలను జూచి యాతని మళ్లింపవలె ననుబుద్ధితో ని ట్లుపన్యసింపఁ దొడంగె.
| |
“ఓయి రాముఁడా! ఆర్యబుద్ధివి, మనస్వివి నగునీబుద్ధి ప్రాకృతునిబుద్ధివలే నిరర్థక మయినది
గాఁగూడదు. లోకములో నెవ్వఁడును మఱియొకనికి బంధువు గాఁడు. ఏలయన: ప్రతిమనుజుఁడు
నొక్కఁడే జనించుచున్నాఁడు. ఒక్కఁడే మృతి నొందుచున్నాఁడు. కావున వీఁడు నాతండ్రి
యనియు నిది నాతల్లి యనియు నేనరుఁడు వారలయం దాసక్తుఁ డగునో వానికంటె వెఱ్ఱివాఁడు
లేఁడు, ఏమన: ఎవ్వఁడు నెవ్వని కేమియుఁ గాఁడు. గ్రామాంతరమునకుఁ బోవుబాటసారి యొక
చోట బసఁ జేసి యామఱునాఁ డాస్థలమును విడిచి స్థలాంతరమునకుఁ జనునట్లు మనుష్యులకుఁ గూడఁ
దల్లి తండ్రి గృహము మొదలగునవి బసలవంటి రని యెంచి ప్రాజ్ఞుఁడు వానియం దాసక్తిని
జూపఁగూడదు. కులక్రమాగత మగురాజ్యమును విడిచి దుఃఖబహుళము కుత్సితమార్గము నగునీవన
వాసము నంగీకరించుట నీకుఁ దగదు. కావున సకలసంపత్సమృద్ధ మగునయోధ్యానగరమందుఁ
బట్టాభిషిక్తుఁడపై సకలభోగముల ననుభవించుచు స్వర్గమం దింద్రునివలె సుఖంబుగ నుండుము. నీకు
దశరథుఁ డేమియుఁ గాఁడు నీవు నతని కేమియుఁ గావు. అతఁ డొకఁడు. నీవు మఱియొకఁడవు.
ప్రాణికిఁ దండ్రి యల్పకారణము. తల్లి ప్రధానకారణము. దశరథుఁడు పొందవలసినగతిని బొందెను.
ఇది మనుష్యుల ప్రవృత్తి. వ్యర్థమగు పితృపుత్రాదిసంబంధముచే నీవు క్లేశము నొందుచున్నావు.
ప్రత్యక్షసౌఖ్యమును విడిచి యప్రత్యక్ష మగుధర్మము కొఱకుఁ బాటుపడునీవంటివారిని గుఱించి నేను
శోకించెద. అష్టకాశ్రాద్ధ మనియుఁ, బ్రతిసాంవత్సరికశ్రాద్ధ మనియుఁ గల్పించి మనుష్యులు తాము
భక్షింపఁదగినయన్నమును వ్యర్థము చేయుచున్నారు ఒకఁడు తిన్నయన్నము మఱియొకనిదేహమును
బొందినయెడల నూరికిఁ బోయినవాని నుద్దేశించి వానియింటిలో నున్నవారు మఱియొకని భుజింపఁ
జేసినచో నాతృప్తి ప్రోషితున కుండవలయాను. అట్లు గానరాదు. కావున యజ్ఞము, దానము,
తపస్సు మొదలగువానినిఁ జేయవలయు నని మనుష్యులను వశపఱచుకొనుసాధనములుగా బుద్ధిమంతులు
కల్పించియున్నారు. పరలోక మనునది లేదు అప్రత్యక్ష మగుపరమును వెనుకఁ బెట్టి ప్రత్యక్ష
మగు రాజ్యభోగాదికమును బరిగ్రహింపుము.”
|
|
ఇట్లు పలికిన జాబాలిపలుకులు విని రాముఁ డిట్లనియె.
| |
"ఋషివర్యా! నాప్రియముకొఱకు నీవు చెప్పినదంతయు నకార్యం బయ్యును గార్యము వలెఁ గానవచ్చుచున్నది. నిర్మర్యాదుఁడు పాపాచారయుతుఁడు నగుపురుషుఁడు సత్పురుషులచే సన్మానింపఁబడఁడు. మనుష్యుఁడు సద్వంశజాతుఁడో, దుష్కులప్రసూతుండో, శుచియో, అశుచియో, వాని చారిత్రమే తెలియఁజేయును. శిష్టసమ్మతుఁడను శీలవంతుఁడను నగు నేను శిష్టగర్హితునివలె
శ్రేయస్సాధనం బగు వైదికకర్మంబుఁ బరిత్యజించి లోకసంకరకారణం బగుభవదుక్తాధర్మమార్గము
నవలంబించితి నేని దుర్వృత్తుఁడ నగునన్ను సదాచారసంపన్ను లగుశిష్టజనులు దూషింపరా? విహీ
నాచారుఁడ నగునాకు స్వర్గ మెట్లు లభించును? లోకమంతయుఁ గారువృత్తము గలది. రా జెట్టివాఁ
డైనఁ బ్రజలు నట్టివా రగుదురు. కావున సనాతనముగా రాజవృత్తము, రాజ్యము, సత్యమూలమయి
నది. లోకము సత్యమందు స్థాపింపఁబడినది. ఋషులు దేవతలు సత్యమును బహూకరింతురు.
లోకములో సత్యవాది పరమపదము నొందును. ఆవృతవాది సర్పమువలె లోకమునకు భయము గలిగించును.
|
|