Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

XXXIX

దాని నెఱుంగక యితరజనులకే కాక యంతరిక్షమందు సంచరించెడు సూర్యచంద్రాదిగ్రహములకుఁ గూడ నగోచగురా లయి యుండెడు సీత రాముఁ డడవికి బోవునపుడు తన్నుఁ గూడ వెంటఁ దీసికొని వెళ్లమని నిర్బంధించెను. వనవాసము బహుక్లేశ మని చెప్పి వలదని రాముఁ డెన్నివిధముల బోధించినను వినక "నాకు భర్తకంటె నొండుదైవంబు లేదు. కావున నట్టిదైనస్వరూపుండ వయిన నీచరణకమలసేవావిశేషంబున విగతకల్మము నై యుభయలోకసుఖంబుల బడసెద, నది యెట్లనినఁ దండ్రిచేత సలిలధారాపూర్వకంబుగా దత్త యైన యువతి యీలోకంబునఁ బతివ్రతాధర్మంబునం బ్రవర్తించె నేనియు నది పరలోకంబునందును నతనికే హితైషిణి యై యుండు నని బ్రాహ్మణముఖనిర్గతం బైన వేదవాక్యంబువలన వినంబడుచుండ శ్రుతిస్మృతిన్యాయంబులవలన మన కిరువురకు నిత్యసంబంధంబు సిద్ధం బగుచుండ సదాచారసంపన్నను బతివ్రతను స్వకీయ నైన నన్నుఁ బురంబుననుండి వనంబునకుఁ దోడ్కొనిపోవుట కేల యనుమతింపవు? సమానసుఖదుఃఖ నగునన్ను నీతోడ వనంబునకుఁ దోడ్కొనిపొమ్ము. దీని కొడంబడవేని విషాగ్నిజలంబులవలనఁ బ్రాణంబుల విడిచెద” నని నానావిధన్యాయానుసరణంబు లగువాక్యంబులఁ బ్రార్థించి యతనిచిత్తంబు ప్రసాదాయత్తంబు గాకున్నం గనుంగొని యద్దేవి ప్రణయాభిమానంబుల నీషత్కోపదీప్తవదన యై వెండియు నిజవల్లభున కిట్లనియె.

"కిం త్వామన్యత వైదేహః పితా మే మిథిలాధిపః
ఇతి జాన న్పరాం ప్రీతిం గచ్ఛ రామ! మయా సహ.”

(అయో. 30.3-8.)

“చ.

విను మిథిలాధినాథుఁ డతివిశ్రుతకీర్తి విదేహుఁ డైన ... ...


క.

... జీవునికరణి నొసఁగఁ దలఁచితివి పరులకున్."

(గోపీ. అయో. 655-666)

అని యిట్లు ప్రణయాతిరేకంబున ననేకకఠినోక్తులం బలికి యెట్టకేలకు స్వానుగమనంబునకు నిజనాథు నొడంబఱిచె. రాక్షసులు హనుమంతునిలాంగూలాగ్రమం దుంచినయగ్నిని సీత "శీతో భవ హనూమతః" అని సంకల్పించి తనపాతివ్రత్యమాహాత్మ్యముచేఁ జల్ల నగున ట్లొనర్చె. “దగ్ధో భవ దశానన!” యన్నచో రావణుఁ డట్లు కావలసినదే కాని,

"శరై స్తు సంకులం కృత్వా లంకాం పరబలార్దనః,
మాం నయే ద్యది కాకుత్స్థ త్తస్య సదృశం భవేత్.”

అని తనభర్తకు రావణవధజనితయశస్సు రావలయు నని కోరినది గావున నట్లు చేయలేదు. మీఁదుమిక్కిలి

"మాం చాస్మై ప్రయతో భూత్వా నిర్యాతయితు మర్హసి,
విదిత స్సహి ధర్మజ్ఞ శ్శరణాగత వత్సలః.
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్చసి.”

"నన్ను రాముని కర్పింపుము. అపరాధి నైన నే నతనికడకు నెట్లు పోఁగల నని నీకు సంకోచము వలదు. ఆయన ధర్మజ్ఞుఁడు, తనవిషయ మయి యపరాధముఁ జేసిన