XXXViii
పీఠిక.
హాని వాటిల్లుట దన కెంతమాత్ర మిష్టపడదాయెను. లోకములో నేస్త్రీ యిట్లు పలుకును? ఎవతె యిట్లు భర్తృయశస్సంపాదనముకొఱకే దృఢనిశ్చయము గలది యగును? ప్రతిస్త్రీయును దాను "బ్రకృతమం దనుభవించుచున్న కష్టములు నివారింపఁబడినఁ జాలును. భర్తృకీర్తిప్రతిష్ఠ లాతర్వాత నాలోచింతము.” అని తలంచును గాని యీరీతి స్వప్రాణాపాయనిర్వ్యపేక్షముగా భర్తృప్రశస్తికొఱకే యాలోచించునాఁడుది లోకమందు మృగ్యురాలు. సీతవంటి మహాపతివ్రతాశిరోమణి కిట్లే యుండును. అత్రిమహామునిభార్య యగుననసూయ యీమెపాతివ్రత్యగుణమును మిక్కిలి శ్లాఘించి యంగరాగము మొదలగువస్తువులు నీమె కొసంగెను. ఈమె యిట్టి లోకోత్తర యగుగుణవతి, సుశీల, పతివ్రత, వివేకిని, జ్ఞానవంతురాలు నయినను రామబాణనిహతుఁ డైనమారీచుని కపటాక్రందనమును విన్నతోడనే రాముని కాపద సంభవించె నని యెంచి యాతని రక్షణమునకై శీఘ్రముగాఁ బరుగిడ మని లక్ష్మణునిఁ బ్రేరణ చేసెను. అప్పుడతఁడు స్త్రీ నొక్కతె నరణ్యమందు విడిచిపెట్టి పోవుట భావ్యము కాదని తలంచి “మేరువు తలక్రిం దైనను సముద్రము లింకఁ జొచ్చినను వహ్ని శీతలత్వంబు నొందినను జగదేకవీరుఁ డగుమాయన్న కించుకంతయు నపాయము రానేరదు నీవు వగవకుండుము. ని న్నొంటి నిట విడనాడి నే నేఁగినచో మనయం దింతకుమున్నే బద్ధవైరు లయియున్న రాక్షసులు నిన్ను భక్షించెదరు. నామాట విను” మని వేయివిధములు బోధించినను నామాటలు వినక యాతని —
| | "సౌమిత్రే! మిత్ర రూపేణ భ్రాతు స్త్వ మపి శత్రువత్, | |
(అర. 45. 5-7)
| | “సుదుష్ట స్త్వం వనే రామ మేక మేకొఽను పశ్యసి, | |
(అర. 45. 24-25.)
| "ఉ. | దోస మటంచు నించుకయుఁ దోఁపక రాఘవుఁ డొంటి నేఁగి ... | |
| చ. | ...బునఁ బడు టంతె గాక యిది పోలునె? చేకుఱునే కులాధమా!” | |
(గోపీ. అర. 766-767.)
అని యుచ్చావచపరుషభాషణంబుల మనస్సు నొప్పించెను. జితేంద్రియులలో నగ్రగణ్యుఁడుగా నెన్నఁదగినవాఁడు, వివేకి, సద్గుణాలయుఁడు, సీతారాములను దలిదండ్రులతో సమానముగాఁ జూచుకొనులక్ష్మణుని నీమె యిట్టియవాచ్యపుమాట లనవచ్చునా? లక్ష్మణుని కెన్నఁడైన నిట్టిదురాశయ ముండు నని లోకము నమ్మునా? ఇట్లు సీత స్త్రీజనస్వభావసులభ మయిన తొందరపాటు, అవివేకము, అవిమృశ్యకారిత్వము గనుపఱుచుట తనతొంటియోగ్యత కెంతో వైసాదృశ్యము నాపాదించు నని పాఠకులకుఁ దోఁచక మానదు. ఈమె భర్త్రనువ్రతత్వము లోకమున కుదాహరణభూతము. సకలసుఖోచితురా లయి యెన్నఁడుం గష్ట మన్న