పీఠిక.
xxxvii
| | తథా మే మాధవీ! దేవీ! వివరం దాతు మర్హసి. | |
(ఉత్తర.)
రామునికంటె నన్యుని నేను మనస్సుచేఁ గూడఁ దలంపనిదాన నయినయెడల నీభూదేవి నాకు వివరము నిచ్చుఁగాక యని శపథము సేయఁగా నాక్షణంబ యత్యద్భుతముగా భూమిలోనుండి పై కుబికిన రత్నసింహాసనమం దామెను భూదేవి తనరెండుచేతులచే నెత్తి కూర్చుండఁబెట్టుకొని పాతాళములోనికిఁ గొనిపోవ నంతరిక్షమునుండి పుష్పవర్షము కురిసెను. ఇ ట్లంత్యవియోగమందు సీత తనయనన్యార్హత్వమును బ్రకాశింపఁజేసెను. కావున సీతావతారమం దీమె తనకృప పారతంత్య్రము ననన్యార్హత్వము నను మూఁడుగుణములను గ్రమముగా లోకములకు వెల్లడిచేయుటకొఱకే భర్తనుండి మూఁడుపర్యాయములు వియోగమును బొందినది. ఇట్లు కానిచో నీశ్వరుని కనపాయిని యయి కర్మవశ్యురాలు కాని యీమెకుఁ గర్భవశ్యులకువలె నీరీతి భర్తృవియోగము సంభవించుటకుం గారణమేమి?
సుందరకాండమున సీత రాక్షసస్త్రీలవలనఁ దాఁ బడుచున్నబాధల నిఁక సహింపఁజాల ననియు, శీఘ్రముగా రాముఁడు వచ్చి రావణుని వధించి న న్నీవిపత్సముద్రమునుండి దరిఁ జేర్చు మని రామునితోఁ జెప్పు మనియు నాంజనేయునియెదుట మొఱవెట్ట నాతఁ "డమ్మా! ని న్నీక్షణముననే రామునికడకుఁ గొనిపోయెద నావీఁపుపై నెక్కుము.
| | "అథవా మోచయిష్యామి త్వా మ ద్యైవ వరాననే! | |
(సుంద. 37-19)
అని హనుమంతుఁడు పలుకఁగా సీత విని యిట్లనియె.
| | "తత స్సత్వం బలం చైవ విజానామి మహాకపే! | |
(సుంద. 37. 40-62)
| "సీ. | వనచరోత్తమ! నన్నుఁ గొనిపోవ దక్షుండ * * * | |
| చ. | * * గొనిచనె నేనిఁ గీశకులకుంజర! తత్ప్రతికారమే చనున్.” | |
(గోపీ. సుంద. 886-896.)
అని యిట్లు సీత హనుమంతునికిఁ బ్రత్యుత్తర మిచ్చెను. తాను సకలబాధలఁ బడుట కైన నొప్పుకొనియెఁ గాని భర్త కీర్తిగౌరవములకుఁ దనమూలకముగా