XXXVİ
పీఠిక.
ముఖ్యప్రయోజనము. గంగానదీతీరమునకుఁ బోయినతరువాత లక్ష్మణుఁడు సీతతోఁ దనయన్న కామెవిషయ మయి కలిగిన దురభిప్రాయమును మిక్కిలి భీతుఁ డై యెట్టకేలకుఁ దెల్పఁగా మిక్కిలి దుఃఖించి సీత మఱఁదితో నిట్లనియె.
| | “న ఖ త్వ ద్యైన సౌమిత్రే । జీవితం జాహ్నవీజలే, | |
(ఉత్తర.)
"లక్ష్మణా! నీవు చెప్పిన యీదుర్వార్త విన్నతోడనే నేను గంగలోఁ బడి ప్రాణములను ద్యజించుకొనవలసియున్నది. కాని, భర్తృసంబంధి యగుసంతతికి విచ్ఛేదము సంభవించు నని తలంచి యట్టిసాహసకృత్యమును జేయుట మానితిని. భర్త్రభిమత మైనగర్భము నాయం దుండుటవలనఁ బారతంత్య్రము నవలంబించి నేను దేహమును ధరించి యుండవలయును." ఇట్లు తనవిషయమయి భర్తమనస్సులోఁ గలిగిన కాలుష్యమును జింతించి వెంటనే దేహత్యాగమున కుద్యోగించి యప్పనిఁ జేయ నోపక పరతంత్రత వహించి భర్తృచిత్తవృత్తిని రక్షించుకొనుచుఁ దనప్రాణములను ధరించి యుండెను. పరులకొఱకు జీవింపవలసియున్న పరతంత్రునికిఁ దనమరణమందుఁగూడఁ దనకు స్వాతంత్య్రము లేదుగదా! ఈమె ప్రథమవిశ్లేషమందుఁ బదిమాసములు పడవలసినబాధ లన్నియుఁ బడి —
| | "పతి ర్హి దైవతం నార్యాః పతి ర్బంధుః పతి ర్గతిః, | |
అని తాను నిశ్చయించుకొన్నటుల పతిచిత్తానువిధానమే తనకు విధి యని పారతంత్య్రబుద్ధిచే ననేకవత్సరము లోర్చినది. కావున నీద్వితీయవిశ్లేషమందుఁ బారతంత్య్రమును వెల్లడి చేసెను.
| | "అనన్యా రాఘవే ణాహం భాస్కరేణ ప్రభా యథా, | |
అన్నట్లు భయసమ్మత మైనతనయనన్యార్హతను సర్వసమ్మతముగాఁ బ్రకాశింపఁజేయుటయే తృతీయవిశ్లేషమునకుఁ బ్రయోజనము. ఎట్లన: రాముఁ డశ్వమేధయాగము నొనర్చుకాలములోఁ గుశలవులు వాల్మీకియాజ్ఞచే శ్రీరామాయణము నచ్చటచ్చటఁ బాడుచుఁ దిరుగుచుండ రాముఁ డావార్త విని యాబాలుర రావించి విద్వత్సభఁ గావించి యాసభలో వారిపాట విని వీరు సీతాపుత్త్రు లని యెఱింగి సీతను దలంచి రేపటిదినమున నాసభకు వచ్చి నేను బరిశుద్దురాలనని తిరుగఁ బ్రమాణము చేసినయెడల నేను బరిగ్రహింపఁగలవాఁడనని సీతకు వార్త నంపెను. లోకాపవాదపరిహారార్థమయి యొకప్రమాణము చేయు మని చెప్పఁగా సీత రామునిసన్నిధి కేతెంచి
| | "సర్వాన్ సమాగతాన్ దృష్ట్యా సీతా కాషాయవాసినీ, | |