Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

XXXV

ష్టిదంతనఖప్రహారంబుల నిందఱ నిశ్శేషంబుగా వధించెద చిత్తంబుకొలంది యాన తి" మ్మనిన నమ్మహాదేవి యమ్మరున్నందనున కిట్లనియె.

"ఏవ ముక్తా హనుమతా వైదేహీ జనకాత్మజా * * *
... ... ... ... ... ... ...
కుర్వతా మపి పాపాని నైన కార్య మశోభనమ్”

(యుద్ధ. 116. 37–45.)

సీ.

“శ్వసననందనరాజసం శ్రయవశ్య లై ... ... ...


వ.

 ... ... బట్టి వారియందు దండనంబు సముచితంబుగా దని పలికె.”

(గో. యుద్ధ. 2919-2921.)

ఈమెభర్త కండుగాథను, గపోతకథను నుపన్యసించి వధించుటకు సన్నద్ధు లైనవానరులవలన భయము మాన్పి విభీషణునిఁ జేపట్టి రక్షించెను. ఈమహాశయురాలు హనుమంతునికి ఋక్షగీతము నుపదేశించి తన్ను నానావిధముల బాధించిన రాక్షసస్త్రీలను జంపెద నని యుద్యుక్తుఁ డైనయాతనియుద్యమము నివారించి వారిని క్షమించి రక్షించెను. సర్వభూతాభయప్రదానధర్మదీక్షితుఁ డగుశ్రీరామచంద్రుని కీయమ తగినసహధర్మచారిణి వివాహసమయముందు "ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ” అని జనకుఁడు చెప్పినమాట సత్య మాయెను. ఈదంపతు లిరువురికిఁ దమవిషయ మయి యపరాధముఁ జేసినవారినిగూడ రక్షించుటయే పరమధర్మము.

మధ్యవిశ్లేషము పారతంత్య్రప్రదర్శనార్థము. ఎట్లన: రావణవధానంతరము రామునితో నయోధ్యకుఁ జని పట్టాభిషిక్తురా లయి సర్వభోగంబుల ననుభవించుచు సుఖంబునఁ గాలంబు గడపుచుండ నింతలో గర్భవతి యైనయీమెను జూచి రాముఁడు —

“ఆపత్యలాభో వైదేహి | మమాయం సముపస్థితః,
కి మిచ్ఛసి సకామా త్వం బ్రూహి సత్యం వరాననే!"

"వైదేహీ! నీ విపుడు దౌహృదలక్షణమును దాల్చియున్నావు. కావున నీమనములో నున్నకోరికను నిజముగాఁ జెప్పుము. నేఁ దీర్చెద" ననవుడు సీత —

"తపోవనాని పుణ్యాని ద్రష్టు మిచ్ఛామి రాఘవ!
గంగాతీరనివిష్టాని ఋషీణాం పుణ్యకర్మణామ్.”

"గంగాతీరమందు నివసించెడుపుణ్యాత్ము లగుఋషులయొక్క యాశ్రమములను జూచుటకు నాకుఁ గోరిక కల” దని విన్నవింప నది మిష పెట్టి పదిమాసము లామె తన్ను విడిచి రావణగృహమం దుండుటవలనఁ గలిగినలోకాపవాదమును దొలఁగించు కొనుటకు సంకల్పించి నిజముగా నామెకోరికఁ దీర్చువానివలె లక్ష్మణునిఁ దోడిచ్చి యరణ్యమందు దిగఁబెట్టించెను. కూడి యున్నపు డెట్లో యెడఁబాసి యున్నపు డట్లే సర్వకాలములయం దేకరీతిగా భరృచిత్తము ననువర్తించునీమె తనపత్నీత్వప్రయుక్త మగుపారతంత్య్రమును వెల్లడిచేయుటయే నీద్వితీయవిశ్లేషమునకు