xxxiv
పీఠిక,
2. స్వతంత్రుఁ డగునీశ్వరుని వశపఱుచుకొనునపుఁ డనువృత్తిచే నాతని వశపఱుచుకొనవలయును కావునఁ బారతంత్య్ర మపేక్షితము.
3. నన్ను విడిచి మఱియొకవిషయమున కర్హత లేనిదయి నాకే యతిశయమును బుట్టించువస్తు వగుటచే మనకార్యమునే కదా యీమె చెప్పుచున్న దని లక్ష్మి చెప్పిన ట్లీశ్వరుఁడు చేయుట కుపయోగించుటచే ననన్యార్హత్వ మావశ్యకము.
ఈసీత మొదట, మధ్యను, అంతమందును రాము నెడఁబాసెను.
నిజకృపాప్రకాశనమే ప్రథమవిశ్లేషమునకుఁ బ్రయోజనము.రావణుఁడు హరించె ననునది యొకమిష. ప్రథమవిశ్లేషమం దీమె తనకృప నెట్లు వెల్లడి చేసెననఁగా:— ఒకపల్లెటూరిలో నుండుబడియిల్లు శిథిలమయి యెండవానలకు రక్షకము గాక యందుఁ జదువుబాలురకు మిక్కిలి బాధక మయియుండ నింతలో నొకసుకుమారుఁ డైనధనవత్పుత్త్తుఁ డందుఁ జేరి వానిమూలముగా నాపాఠశాలామందిరము బాగుపడి బడిపిల్లల కందఱకు సౌఖ్యదాయక మయినటుల, రావణుఁడు బలాత్కారముగా హరించె ననునొకవ్యాజమును గల్పించి తాను స్వయముగా లంకకుఁ బోయి యచటఁ బదిమాసములు చెఱలో నుండి యంతకుమున్ను రావణునిచే గారానిబద్ధ లైనదేవతాస్త్రీలచెఱ విడిపించుటచేఁ దనకృపాతిశయమును వెల్లడిచేసెను.
ఇదియ కాక త్రిజటాస్వప్నవృత్తాంతములో
| | "సీతాం తాభి రనార్యాభి ర్దృష్ట్వా సంతర్జితాం తదా, ... | |
(సుందర. 27 స)
అ ట్లనేకవిధములఁ దర్జనభర్త్సనాదులచే సీతను బీడించుచున్న యేకాక్షి యేకకర్ణి మొదలగు రాక్షసస్త్రీలను జూచి యపుడు నిద్రనుండి లేచిన త్రిజట యిట్లనియె. "అనార్యలారా! ఇంక సీతను బాధింపఁబోకుఁడు. రాక్షసులందఱు నశించునట్లు నీమెభర్త జయము గొన్న ట్లిప్పుడు నే నొకభయంకర మైనకలఁ గంటిని. కావున నీమెను మంచిమాటలతో బతిమాలుఁడు. మన మీమెకు నమస్కరించినయెడలఁ బ్రసన్నురా లయి రాక్షసస్త్రీలను భయమునుండి రక్షించుటకు సమర్థురాలు." ఇట్లు త్రిజట పల్కినపల్కులు విని రాక్షసస్త్రీలు భయము నొందుచున్న సీత వారినిఁ జూచి "మీ రెంతమాత్రము భయపడవలదు. అట్లు మీ కాపద సంభవించినయెడల నేను మిమ్ముఁ దప్పక రక్షించెద" నని యభయప్రదాన మొసఁగెను. ఇ ట్లనుటయేకాక తాను చేసినప్రతిజ్ఞఁ దరువాతఁ దప్పక నెఱవేర్చెను. ఎట్లన: రావణవధానంతరమందు రామవిజయవార్తను దనతోఁ జెప్పుటకు వచ్చిన వాయుపుత్త్రుఁడు —
| | "ఇమా స్తు ఖలు రాక్షస్యో యది త్వ మమమన్యసే | |
(యుద్ధ. స 116. 31-32)
“చిరకాలమునుండి ని న్ననేకబాధలు పెట్టుచున్నయీరాక్షసస్త్రీలను వధియింప నిశ్చయించితి; అనుజ్ఞ యొసంగితివేని యిప్పుడ చరణజానుజంఘోరుపాణిము