పుట:Goopa danpatulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
88

గోపదంపతులు.

నాయాజ్ఞలేనిదే నీ విల్లువిడిచి వెడలరాదనియు, నెవరేబహుమానిమిచ్చినను స్వీకరించరాదనియు, నిన్ను శాసించుచున్నాను. నాయాజ్ఞమీఱెదవేని, నిన్ను గఠినముగా శిక్షింతునని నమ్ముము.

   గంగ--పంజరములో చిలుకవలె బంధింపబడి, మీరు దయాపూర్వకముగా నిచ్చునాహారముం దినుచు మీ కింపుగల్గుటకు మాటలాడుచు నుండవలసిన నికృష్ట జీవనమా నాది? నాయెడ దమకుగల గాఢానురారమున కీకఠినశాసనములు తగవు. ఆలోచించుకొనుడు.
   ఇత్తఱి రంగాధ్యక్షుడువచ్చి యప్పలసామి ఫీట్సు చేయవలసిన వంతు వచ్చినదని తెలియజేసెను. వెంటనే యతడు తనయగారమును విడిచి యరిగెను. గంగమ్మ జప్పున దివ్వెదగ్గఱకేగి నటేశము తన కందిచ్చిన కమ్మవిప్పి చదివెను. అందిట్లు వ్రాయబడి యుండెను.
       "ప్రేయసీ! నీమగనిరాక మన సంభాషణమున కడ్డంకి యౌటచే నిన్ననిన్నర్దించి వనిమనుగ్రహింప నంగీకారముం దెల్పుటకు నీకవకాశము లేకఫోయినది. కాని నీ దయార్ద్రహృదయమునుండి యొకటిరెండు ప్రేమామృతశీతలకరములు నాపరితప్త హృదయముపై బడి యించుక యుపశమన మొసంగ కపోలేదు. నేనింక మిక్కిలిగా వక్కాణింప నక్కఱలేదు. నీవు నాకొర్కెయీడేర్చి నాతనువు నిలుపకతప్పదు. సమ్మతిని దెల్పుట కేవలసిన కుబ్జాకకుసుమములలో నొకటి ధరించి రేపు రంగస్దలమునకు రమ్ము. ఏకారణముచేతనైన