పుట:Goopa danpatulu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

87

స మ్మ తి.

యని తోచుచున్నచి. క్రమముగా నిట్టిస్దితికివచ్చితివా? నీహృదయము దాపక తెలుపుము.

  గంగ—-నామీద నిట్టి యపనింద వైవదగవా? ఒకగొప్లవా డేవో పూలనిచ్చినం గైకొనుట తప్పా? నలువురిలోదొమ్మరివిద్దెలం జూపుటకు సిద్దపడినప్పు డీతప్పు తమకుదోపలేదా? మీరకారణముగా నన్ను నిందావాక్యములాడిన నే సహింపజాలను. మీరెక్క డెక్కడికో పోయి వచ్చుచుండ నే ననుమానపడుచుంటినా? మిమ్ము నేనెట్లు గౌరవించుచుంటినో, నన్నుమీరును నారీతిగాగౌరవింపవలసియున్నది. 
   అప్ప—-చెన్నపట్టణపు గాపురము నీకెట్టి తెగువగల్గించినది! ఇంట నొకమూల బడియుండవలసిన నిన్ను బయటికి రానిచ్చుట నాతప్పే. నీకంతస్వాతంత్ర్యము నే నిచ్చియున్నను, నీవెన్నడేనినన్నెదిరించి మాఱుపల్కు టెఱుగుదువా? మనకాపురమున కేదియో కీడు మూడనున్నది కనుకనే నీవిట్టి నుడులాడుచున్నావు.
   గంగ—-మీరు నన్నిట్టు లవమానముచేయుట న్యాయమా? నేనాడిన మాటలలో దెగువమాటలెవ్వి? నేను దిన్నగా బల్కుచుంటిననియే నా నమ్మకము. దోషవాక్యములే నానోట వెలువడెనని మీకుదోచిన, నన్ను క్షమింపుడు. నేను క్ష్యంతవ్యురాలనుగదా!
    అప్ప—-క్షంతవ్యతకేమిలెమ్ము. నీవిక నాచేట్టియార్లతో నెట్టిసమయము లయందైనను బ్రసంగింపరాదనియు,