పుట:Goopa danpatulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

85

స మ్మ తి.

టివా? యని యడిగెను. గంగమ్మ మొగము వెలవెలబోవ దలవంచి, “నే నాయంగడినే చూడలే“ దని జవాబిచ్చెను. అప్పలసామికి సందేహ నివృత్తికాలేదు. అతడు విశేషముగా బ్రసంగింపక భార్యతో గూడి భుజించి చాలాసేపు యోజించుచు గూఫుచుండి యవల నిద్రించెను.

   ఆమఱునాటి రాత్రి మరల సర్కసుప్రదర్శనము గలదు. మన నాయికానాయకు లచ్చెరువుగొల్పు సాముసము లెన్నియోచేసి మెప్పొందవలసియున్నది. మున్నొకప్రదర్శనమున కొక జమీందారుడు చూడచ్వచ్చి గోపదంపతుల నైపుణ్యమునకు గడుమెచ్చి వారికి ననువగు విన్నాణపు జిలుగువసనములు బహుమానముగా నిచ్చెను. వానిని ధరించి నేడు మనకధానాయకుడును నాయికయు రంగస్దలమునకు రాదలచిరి. వారావేషములతో వారికై యేర్పఱుపబడిన గదిలో గూఫుచుండిరి. ఆగదినుండి ముందుగా నప్పలసామి యీవలకువచ్చి కొంతమంది బాకులతోగూడి చేయు ‘ఫీట్సు ‘ చేయుచుండెను. ఇదియే సమయమని తలచి, నటేశమొక గులాబీపూలగుత్తి చేతబట్టుకొని, యందు రమయ్యంచెట్టి వ్రాసియిచ్చినలేఖను భద్రపఱిచి, దానిని బట్టుకొని గంగమ్మ గదిలోనికిబోయి, “మారామయ్య దీనిని నీకిమ్మని నన్ను బంచినా“ డని చెప్పుచు నిచ్చెను. ఆపుష్పగుచ్చము జరీతో మిగుల సుందరముగా గట్టబడియుంటజూచి, గంగ