పుట:Goopa danpatulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
84

గోపదంపతులు.

భయమెవరికి? అమాటలవలన లోపలనున్న స్త్రీ నాభార్యయే కావలయును? అదియే వచ్చిన దనుకొందము. దారితో నాయనుమానుల భార్యలు తోదుగా నున్నారుగదా? వారెట్లు దానినొంటిమై నిడుతురు? విడిచినను నది బరితెగి నిండు సంతలో బరపురుషునితొ నెట్లు మాటాడ సాహసించును. ఆదుష్టుడు నాబసకెదుటే వాస మేర్పఱుచుకొని యుండగా, వారికొఱకది యీసంతపట్టున కేలవచ్చును? అదియు నమ్మదగదు. దైవము నామనస్సు కలచి నన్ను శోధించుటకిట్టి వింతచేయిదములం జేయుచున్నాడు" అని తనలొ దాను బల్కికొని భోజనముచేసి ఇంటికేగెను. గంగమ్మ చూపులలో నెప్పటి శాంతభావము కన్పట్టకుండెను. ఆమె కపోలదర్పణములందు లజ్జాజనితారుణ్యము మాటిమాటికి బొడసూపి మాయమగుచుండెను. అప్పలసామి, "గంగూ! పార్కు ఫేర్ వింతలేవేని గలవా?" యని యడిగెను. "మీరెఱుగని వింతలేమిల్యుండు" నని యామె బదులుచెప్పెను. ఆమాటకూడ నప్పలసామికనుమాన హేతువేయయ్యెను. అతడు తలపంకించి, "నీవు సంతలో దిరుగునప్పుడు మన యజమానుల యిల్లాండ్రుకూడ నుండిరా?" యనెను. "ఉండకేమి! ఒక్కచోట మాత్రము దారిదప్పితిమి. మరల గొలదికాలమునకే కలసికొంటిమి" అని గంగమ్మ పలికెను. ఈమాటలు కూడ వానిసందేహమునకు దోడ్పడుచునే యుండెను. ఇంక మనసుండబట్టక "నీ వాహార్మోనియముల యంగడికడ నుం