పుట:Goopa danpatulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

83

స మ్మ తి.

గెను. అతడు తఱుచుగా నక్కడికిబోయి 'టెన్ని ' సో, 'బిలియర్డు ' సో యాడి. కొంతసేపు ఘనులతో నిష్టగోష్టి బ్రసంగించి వచ్చుచుండును. అతని కీపురము చేరినతర్వాత నాంగ్లభాషతొ భాషించుట లెస్సగా నలవడినది. గంగమ్మగూడ గొంచెముగా నింగ్లీషుభాష యందు బ్రవేశముగలిగెను. సూర్యాస్తమయవేళ కాదంపతులు సముద్రపుటొడ్డునకు వయ్యాళికి బోవుచుందురు.

    నాడుగూడ నప్పలసామి కడలిదరికేగి యొక యేకాంతస్దలమున గూరుచుండి తలపోతకుం జొచ్చెను. "గాజుల చప్పుడునుబట్టి మనుష్యులను గుర్తుబట్టుట కెందఱికి యట్టి గాజు లుండవచ్చును.. రామయ్యచెట్టి భార్యకుగూడ నట్టి యాభరణములే చేతికుండబోలు, కాని యాద్వనిలో నించుకంతయు భేదము లేదుగదా! పోనీ; ఆచప్పుడు మఱియొక వనిత వలన గల్గిదనుకొందము 'సామివద్ద కెళ్ళినాడు. ఇంక భయములే ' దని నాకు వినబడిన మాటల కర్దమేమై యుండును? నేను గాక మఱియొక సామిపిళ్ళ యుండునా? నాకీపిళ్ళబిరుద మీ దాక్షిణాత్యు లిచ్చిరి. నాకు బిళ్ళశబ్దము చేర్చి వారు మత్రమే వ్యవహరింతురు. దాక్షిణాత్యులలో సామిపిళ్ళ మఱియొకడు గలడేమో! ఎవ్వడెఱుంగు? కాని యప్పడు వచ్చిపోయిన సామిపిళ్ళను నేనొక్కడినే గదా! సరియే, నన్నూహించియే వారు పలికిరందము. నావలన