పుట:Goopa danpatulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
82

గోపదంపతులు.

గంగమ్మ బ్రతుకుజీవుడా యని యీవలబడి నెయ్యరాం డ్రకై నమెక నారంభించెను. వారును నీమెకొఱకు వెదకుచుండిరి. తుదకు మూర్మార్కెట్టులో నందఱు గలసికొనిరి. కొనదలచుకొన్న సామాగ్రి కొని గంగమ్మ హితురాండ్రతో నింటికేగెను.

10. సమ్మతి

-(0)-

     ఇంతకు బూర్వ మప్పలసామి కాఛెట్టియార్ల మీదనే కాని తనభార్యమీద నెట్టియనుమానమున్ లెకుండెను. వారెట్టి కూళలైనను దనభార్య యగ్నిహొత్రమువలె దాకరానిదని యతని నమ్మకము. తనపై నామెకుగల ప్రేమ కెట్టిభంగమును గలుగదని యతని దృఢవిశ్వాసము. ఇటులుండ, నేడతనికి గోచరించినవానిం బట్టిచూడ నతనిహృదయము పరిపరివిధముల నాందోళింపజొచ్చెను. అతడుబసకేగి దుస్తులు మార్చుకొని కాస్మొపొలిటన్ క్లబ్బున కేతెంచెను.
   కాస్మోపోలిటన్ క్లబ్బు చెన్నపురిలోగల ఘనులెల్ల గూడి వినోదలీల గాలముంగడపు భవనరాజము. స్టార్ సర్కసు యజమాను లందుసభ్యులు. వారు మన కధానాయకుని గూడ సభ్యునిం గావించిరి. అతనికి బౌరులలో నున్నతస్దితియందున్న వారితోనెల్ల నీసభ్యతవలన బరిచయము గలి