పుట:Goopa danpatulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

79

పార్క్ ఫేర్.

మామె నప్పుడే యూహించెను. కాని సహజసౌశీల్యము గల దగుటచే దానిని జయింప యత్నించుచుండెను. నటేశము తమ్ముని యంగడికేగి యొకరహస్వస్దల మేర్పరచివచ్చెను. రామయ్యయు గంగమ్మయు నందేగి యిట్లు సంభాషించిరి.

    రామ--నీ విన్నినాళ్ళు నాయందు దయగలిగి నేను నీతోభాషించుటకు సమ్మతించినందులకు నేను మిగుల గృతజ్ఞడను. నీతో మాటాడినకొలది, నీ ముఖారవిందముం జూచినకొలది, నాకు నీకుపైనిగల్గు మోహ మతిశయించుచున్నది. నాభార్యకు నాకును బడక, నేనామెను శాశ్వతముగా విడిచిపుచ్చితినని మున్నే వచియించి యుంటినిగదా? నాయపార ధనసంచయము లనుభవించుట కామె నోచలేదు. నా హృదయము నీయందు లగ్నమైయున్నది. నీవు నాదండనుండి నన్ను నిరంతర సౌఖ్యవీచికలు దేలించుట కంగీకరింతువేని, నాయాస్తియంతయు నీవ

శ మొనర్తును. నాదేహమేకాక నా సర్వస్వము నీ కర్పించుకొందును. నా యందు గరుణించి యంగీకరింపుము.

    గంగ--అయ్యా! మొదటినుండియు దమచర్య గమనించుచుంటిని. తమవంటి యైశ్వర్యవంతుల స్నేహము నాక్ గల్గుట నాయదృష్టమే. కాని చిన్ననాటినుండియు మనసారబ్రేమించి వరించిన నా నాధుని విడుతునేని నాయట్టి ద్రోహి వేరొక్కతె యుండునా? మీరిట్లు సాహసించి నన్నడిగినందు