పుట:Goopa danpatulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
76

గోపదంపతులు.

దర్శనమీని ధరణీపాలు రాతిరునాళ్ళయం దెల్లరకు బాహాటముగా దర్శనమిత్తురు. తమ యధికార గర్వమంతయు నుడిగి సంచరింతురు. దుష్టులగు జార చోరకుల కట్టి మహోత్సవసమయము మిగుల నుపకరించునని వేఱుగ వ్రాయనక్కరలేదు. కాని వారి హావడి మాన్పుటకు దొరతనమువారు నియమించిన రక్షకభటులును, వైచ్చిక సేవాసంఘసభ్యులు కొందఱును జాల దోడ్పడుచుండిరి.

     ఇట్టియుత్సవముం జూచుట కొకనాడు గంగమ్మయు సర్కసుయజమానుల భార్యలును గలసి వెళ్ళిరి. అప్పలసామి ప్రతిదినము సాయంకాలమున బోయి యాయావినోదములం దిలకించియే వచ్చుచుటచే భార్యతొగూడి యేగలేదు. భార్యకు దొడుగా దనమిత్రుల యాడువాండ్రు కలరుగదాయని యెంచి యతడామెను నిర్భయముగా విడిచిపెట్టెను. నాడే మన చెట్టియారులును సంతకేగుట తటస్దించెను. స్నేహితురాండ్రతొ గూడి గంగమ్మ రామయ్య కెరుదుపడెను. అత డులికిపడి యాగి యామె యేదుకాణమున కేగిన నాదుకాణమునకు దానును నటేశముతో బొవజొచ్చెను. ఒకయంగడికడ జనసమ్మర్దము విశేషముగా నుండెను. గంగమ్మ మాత్ర మీవల నుండిపోయి యెదుట గనబడు వస్తువుల బేరము చేయుచుండెను. ఆమెతో మాటలాడుట కిదియే తగిన యదనని నటేశము సొదరునితోజెప్ప, రామయ్య, 'గంగా