పుట:Goopa danpatulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

75

పార్కు ఫేర్.

బడును. దుకాణములయందే కాక యితరస్దలముల యందును నడుమనడుమ బహుదీపికలు తారానాధునిసేవించు నక్షత్రములవంటివి యనేకములు గలవు. దీపములన్నియు వెల్గింపబడిన వెనుక దాని సౌందర్యము చూచితీరవలయుగాని వర్ణింప నశక్యము. జామురాత్రి మీఱినతర్వాత గాల్పబడు బాణసంచులంజూడ గన్నులపండుగ నగును.

  వానిలో నొకటివెల్గింపగా నాంగ్లభాషతొ ప్రేక్షకులకు స్వాగరము, అను నక్షత్రశ్రేణి వింతరంగులీను కాంతులతో నేర్పడును. ఇంకొకటికాల్చంగా రంగురంగుల ముద్దలను నల్దిక్కులకు వెదజల్లుచు గిరగిర దిరుగు చక్రమొకటి చలించును. మఱియొకటి యగ్నిదరికొల్పగావీణియవాయించుచు బద్మాసనముపై గూర్చున్న సరస్వతియగును. వేఱొకటి యంటింపగా గమలాలయయగు లక్ష్మీయు నామెకు క్షీరాభిషేకమొనర్చు గజధ్వయమును నేర్పడును. మఱొకటి పూవులు, కాయలు, పండ్లు మున్నగువానిచే శోభించు వృక్షరాజమగును. ఇంక గొన్ని దశావతారములుగను, గొన్ని పురానగాధా బోధకమగుదృశ్యములుగను, నేర్పడును. ఇట్టివి పల్తె ఱంగుల బాణసంచులు కాల్చబడినపిమ్మట గట్టకడపట శ్రీసార్వభౌమదంపతుల విగ్రహములు వెల్లడించునది వెల్గింపబడును.
        ఇట్టు లాసంగతి యొకనెల జరుగును.దానిం దిలకించుటకు సామాన్యజనులేకాక మహారాజులుసైతము తమతమ కుటుంబములతో వస్తురు. ఇతరసమయములయం డొరులకు