పుట:Goopa danpatulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
74

గోపదంపతులు.

ములు పెక్కు గలవు. ఇట్టుగా సంతపట్టు చుట్టు విపణివీధులమర్పబడి యుండును.

    మధ్యప్రదేశమందు క్షీరోసలములచే జిత్రింపబడిన మహారాజుల విగ్రహములు కొన్ని గలవు. అందు వేంకటగిరిమహారాజుగారుతదుత్సవమునకు ఘనవిరాళము లిచ్చియుండెను. గావున, వారి దివ్యరూపముందెల్పు శిలావిగ్రహముండెను. అప్పటి గవర్నగారీసంత జయప్రదముగా  జరుగుటకై చాల బ్రోత్సహిమిచిరిగావున వారి రూపవిగ్రహము లెన్నో వారి యౌదార్యమును జిత్రకారుని రచనాసౌందర్యమును వెల్లడించునవి యందుండెను.
    వేరొకపట్టు దేశీయ పారిశ్రామిక విద్యావైశారద్యముం  దెల్పు కఱ్ఱవస్తువులు , నేతసరకులు. లోహమయ పదార్దములు, వ్రాతపుల్లలు, (పెన్సిల్సు) సురాబుడ్దులు, కాగితములు, మున్నగు వస్తువుల ప్రదర్శనశాలలు గలవు. అందెడనెడ లలితకళలలొ జిత్రలేఖనమందు నైపుణ్యము గలవారు రచియించిన మనోహరపటము లునుపబడిన తావులును గలవు. అందందు జూపఱుల నేత్రముల కానందముగొల్పు జలయంత్రములు, కృత్రిమోసవనములు, నాటకములు, సినీమాలు, మొదలగునవి యేర్పాటు చేయబడియుండెను.
     రేల నాసంతపట్టునడుమ నొకదివ్వె చంద్రకాంతుల నధ:కరించు కాంతులు గలది యెత్తయిన తావున నిలుప