పుట:Goopa danpatulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

69

అనుమానము.

సేయ గూర్చుండిరి. అప్పుడప్పలసామియే యిట్లు మాటాడదొడగెను.

 అప్ప--గంగ! నిన్నరాత్రి మనకు బదకములిచ్చిన చెట్టియార్లు నేడు తమగదిలోనికివచ్చిరా!
   గంగ--(కలవరమించుక చెక్కుటద్దలదోప) వారు గదిలోనికివచ్చి కూరుచుండినటులే నాకు దోచినది. వారిపకపకనవ్వులు, పెద్దగొంతుమాటలు కొన్ని వినబడినవి. వారు మిమ్ముబిలిచినట్లు ధ్వనివింటిని. కాని తలుపు తీయకుండగనే మీరింటలేరని జవాబిచ్చితిని. అంతయే.
   , అప్ప--(తలపంకించి) అటులైన వారు మరల బిలిచిరా?
   గంగ--మరల బిలుచుటేమి?
   అప్ప--వారు దారిలో నాకుగనబడిరి, నాతొ మాటాడిరి. నేఇంటలెనని యెఱింగియు మరల నన్నేల పిలువవలయు? ఇచ్చట వారియుని కేదోదురాలోచన మున్నదనియే తలంతును.
   గంగ--(మనస్సుదృఢపఱచుకొని) వారి దురాలొచనములు మనల నేమిచేయగలవు? మీరేమియు భయపడనక్కరలెదు.
    అప్ప--ఏమో! ఏమితెలియును? ఇట్టి మహానగర నివాసమెట్టిముప్పునకు వచ్చినదో ! నెలకు నాల్గువందలవంతున