పుట:Goopa danpatulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
66

గోపదంపతులు.

    గంగ-- భోజనసమయమునకు వత్తురు. భోజనము  పదిగంటలకు.
    రామ-- అలాగునా? గడచినరాత్రి మీప్రదర్శనము మిగుల మనోహరముగా నున్నది. దానిని గొనియాడుటకు నాభాషచాలదు.
     గంగ--మీకందఱకు మాయం దవ్యాజకరుణ యుండుటచే శ్లాఘించుచుంటిరి. కాని మేముచేయు పను లంతవింతలుగావు.
      రామ--మాయవ్యాజకరుణగాదు. మీయవ్యాజ కరుణయే మీమీద బ్రసరించుటచేత మేము కడుధన్యులమైతిమి. సర్కసుకంపెనీలలో స్త్రీలుచేయు వింతపనులెన్నొ కాంచితిమి కాని మీరుచేయు నిన్నాణపు జేష్ట లెచ్చటను జూచియుండలేదు. అందుచేత సర్వదా మీ సుందరవిగ్రహమే మాకన్నుల గట్టినట్టులుండును.
     గంగ--తమసదభిప్రాయమున కెంతయు గృతజ్ఞరాలను.
   రామ--కృతజ్ఞత మాటలతో జూపరాదు.
   గంగ-- మఱి దేనితో జూపగలము! మీరు కోటీశ్వరులుగావున బదకములిత్తురు. మేమేమీయ గలము?
   రామ--మీరు తలచుకొన్నగోటిపదముల విలువ గలుగు మీమనసే యీయవచ్చును.