పుట:Goopa danpatulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

65

అనుమానము.

    నటే--వారింతలోరారని నానమ్మకము. నేడు మనము బయలుదేఱునపుడు తెల్లనిపాలావును ద్రోలుకొని యొక గొల్లది యెదురువచ్చినది. మన కార్యము జయప్రదముగా సాగుననియే నాకప్పుడు తోచినది.
     రామ--తినబోవుచు రుచులెందులకు? వెళ్ళుచున్నాముగదా, చూతముగాక! 
     అని వారిరువుదు మేడమీదికేగి తమగదిలోబ్రవేశించిరి. గంగమ్మ యేదో గృహకృత్య విశేషమందు నిమగ్నచిత్తయై యుంటచే వారిరాక గమనింపలేదు. తమరాక యామెకెఱింగించు నుద్దేశము తో రామయ్య గొంతసే పీలపాట బాడియు గొంతతడవు సోదరునితో బెద్దగొంతుపట్టి భాషించియు బ్రయాస పడెను. కాని యామెవినలెదు. తుదకు వారేమార్గముం గానకపొవుటచే "సామిపిళ్ళే"  "సామిపిళ్ళే" యని పిలిచి, గంగమ్మ భర్తయెక్కడికి వెళ్ళెనని చెప్పుచు దలుపుతెఱచి చూచెను. చిఱునవ్వుతొ రామయ్య యామె వంక జూచెను. ఆమె మరల "వారు శంభులింగముపిళ్ళగారితో నెచ్చటికొ వెళ్ళిరి. వారితొ నేమేని నుడువమందురా?" యని యడిగెను.
    రామ--(సానురాగముగ జూచుచు) "అవును, మఱచిపోయితిమి, వారు మాకు దారిలో గబబడియే యున్నారు. వారెంతసేపటికివస్తురు!"