పుట:Goopa danpatulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
64

గోపదంపతులు.

లేచి కాలకృత్యములను నెఱవేర్చుకొని భార్యతో జాఫీ పుచ్చుకొని నాటియుదయమున వచ్చిన టపాయుత్తర ములను వార్తాపత్రికలను జదువుకొనుచు గూరుచుండగా శంభులింగము పిళ్ళగారు వచ్చి "సామిపిళ్ళే! మనమొక్కసారి సర్కసుశాలకు బోవలయును. ఒకతొందరపని గలదని చెప్పెను. అప్పలసామి దుస్తులుధరించి తనయజమానితో బయలుదేఱి వెడలెను. వారు మేడదిగి వీధిగుమ్మము కడకు వచ్చుసరికి నటేశము రామయ్యశెట్టిగారులు మోటారుదిగి లోనికి వచ్చుచుండిరి. అప్పలసామి యించుకనిర్వేదములో వారివంకజూడ వారు తెచ్చికోలు వికాసముతో "గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్!" అని సమీపించి కరముస్ప్శుశించి, "ఇంత పెందలకడనే యెచ్చటికిబోవుచుంటిరి?" అనిప్రశ్నించెను. శంభులింగముపిళ్ళగారు సర్కసుశాలకొక తొందరపని మీద బోవుచుంటిమని మాఱుపలికి చెట్టియార్లకు వందనమిడి తనకారుమీద నప్పలసామి నెక్కించుకొని వెడలిపోయిరి. అప్పలసామి వెనుకకు జూచుచునే పోయెను.

    నటే-- తమ్ముడా! నేడు నీరొట్టె నేతిలోబడినది. సామిపిళ్ళ యింటిలో నుండడు. గంగమ్మాళుతో గొంతసేపు ముచ్చటలాడవచ్చును.
     రామ--సామిపిళ్ళ మరల బసకు వెంటనేవచ్చు నేని మనము కొంచెముసేపు వార్తాపత్రికలు జదివికొని పోవలసియుండును.