పుట:Goopa danpatulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

63

అనుమానము.

లేదు. గంగమ్మలేచి కల్యంబులుదీర్చి మగనితో గాఫీపుచ్చుకొనుటకు వేచియుండెను. “గంగూ! భ్రష్టురాలవైతివా?” యని యప్పలసామిఏసిన కేక ప్రక్కగదిలో గూర్చున్న గూర్చున్న గంగమ్మకు వినబడి యులికిపడి యప్పలసామికడకేగెను.అతడింకను నిదురించుచునేయుండెను. నిద్రలోనట్లు కలవరించెను గాబోలునని గంగమ్మ యూహించి యతని కెట్టిల వచ్చినదొ యని యనుమానపడుచు భర్తను జేతితోమెల్లగాదట్టి“చాలప్రొద్దెక్కినది లెండు“ అనిలేపెను. అతడుత్రుళ్ళిపడిలేచి కండ్లునులిమికొనిభార్యవంక దేఱిపాఱజూచి కొంతతడవుండి “గంగూ! నాకునీమీదబాడుకల యొకటివచ్చినదిసుమా? అనెను. ఆకలయెట్టిదని గంగమ్మ యడుగ నతడుట్లనెను. నీవుసర్కసులో‘ఫీటు ‘ చేయుచుండగా నిన్నొక ధనవంతుడు చూచి మోహించి యేమాయోఆయముచేతనో త్నయొద్దకి రావించుకొని నట్టులును నీవువానివెన్నాడిచనువు బోనువుబోవుచుండ నాకంట బడినట్లును, నేనునివ్వెఱపడి నిన్నుజూచి “అయ్యో! ఇట్లు చెడిపోతివా? యనిపల్కినట్లును, గలంగంటిని. దానినెల్ల గంగమ్మవిని, “అందుచేతనే కాబోలు మీరు గంగూ! భ్రష్టురాలవైతివా? యని పలువరించిరి. మంచికలే కనుచున్నారు. రాత్రి యాచెట్టియార్లను గూర్చి తలపోయుచు నిదురించిరి కాబోలు. మీయభిప్రాయము లెటులుండునో వానినిసుగుణముగనే మీకు గలలును గల్గునుగదా?” యనెను. అప్పలసామి తలపంకించి